Begin typing your search above and press return to search.

'రాజా శివాజీ'లో 'చావా' ఇంపాక్ట్ ఉందా?

రివ్యూల విషయానికి వస్తే..ఈ చిత్రం మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది. ప్రధానంగా రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వ ప్రతిభ, నిర్మాణ విలువలు, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనితీరు అద్భుతంగా ఉన్నాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   2 May 2026 8:00 AM IST
రాజా శివాజీలో చావా ఇంపాక్ట్ ఉందా?
X

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత గాథ ఆధారంగా రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన `రాజా శివాజీ` చిత్రంలో చావా ఇంపాక్ట్ ఉందా? ఛ‌త్ర‌ప‌తి శివాజీ జీవిత‌క‌థ‌ను శంభాజీ మ‌హారాజ్ జీవిత‌క‌థ‌ను మ‌లిచినంత ఎమోష‌న‌ల్ ఇంపాక్ట్ తో తెర‌కెక్కించారా? అస‌లు క్రిటిక్స్ ఏం డిసైడ్ చేసారు? ఓపెనింగుల రేంజు ఎలా ఉండ‌నుంది? అన్న‌ది ప‌రిశీలిస్తే.. వివ‌రాలు ఇలా ఉన్నాయి.

రాజా శివాజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశాజనకమైన ఆరంభాన్ని అందుకుంద‌నేది ప్రాథ‌మిక వార్త‌. నిజానికి రితేష్ దేశ్ ముఖ్ న‌టించిన ఈ సినిమాకి విడుదల ముందు అంచనాలు ఓ మోస్తరుగానే ఉన్నా థియేటర్ల వద్ద కనిపిస్తున్న రద్దీ - ఆన్‌లైన్ బుకింగ్ ట్రెండ్స్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని ఇస్తోంది. ధురంధర్ 2 ఫుల్ ర‌న్ ముగిసి బూత్ బంగ్లా స్పీడ్ త‌గ్గ‌డం కూడా రాజా శివాజీ కి క‌లిసొస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

రివ్యూల విషయానికి వస్తే..ఈ చిత్రం మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది. ప్రధానంగా రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వ ప్రతిభ, నిర్మాణ విలువలు, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనితీరు అద్భుతంగా ఉన్నాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. శివాజీ మహారాజ్ కాలం నాటి వైభవాన్ని, కోటలను వెండితెరపై ఆవిష్కరించడంలో సాంకేతిక బృందం సఫలీకృతమైంది. వినోదపు స్థాయి కూడా బాగుండటంతో సామాన్య ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఇది సినిమా ఆరంభ వసూళ్ల‌కు క‌లిసి రానుంద‌ని అంచ‌నా.

అయితే కథనం విషయంలో సినిమా కొంత తడబడినట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో వచ్చిన `శంభాజీ` వంటి చారిత్రక చిత్రాలలో ఉండే బలమైన భావోద్వేగ ప్రభావం ఈ `రాజా శివాజీ`లో కొంత లోపించిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కథ విడివిడిగా సాగడం .. నేపథ్య సంగీతం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల`శంభాజీ`లో ఉన్నంత ఘాఢ‌మైన ముద్ర‌ను వేయ‌లేక‌పోయిందనే వాదన వినిపిస్తోంది.

వసూళ్ల పరంగా చూస్తే.. ఈ వారాంతం సినిమాకు అత్యంత కీలకం కానుంది. రితేష్ దేశ్‌ముఖ్- జెనీలియా జంటకు ఇది ఒక కంబ్యాక్ మూవ్‌మెంట్ లాంటిది. గత కొన్ని ఏళ్లుగా భారీ విజయాల కోసం ఎదురుచూస్తున్న ఈ జంటకు..`రాజా శివాజీ` బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తే మళ్లీ పూర్వ వైభవం లభించడం ఖాయం. ప్రస్తుతం ఉన్న పాజిటివ్ టాక్ .. పోటీ లేని వాతావరణం సినిమాకు మెరుగైన వసూళ్లను రాబట్టి పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.

రాజా శివాజీ సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తెర‌కెక్కింద‌నే భ‌రోసా ఉంది. కథనంలో కొన్ని లోపాలు ఉన్నా.. రితేష్ - జెనీలియా నటన సినిమాను నిలబెట్టాయ‌న్న టాక్ వినిపిస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఒక మంచి అనుభూతిని మిగిలిస్తుంది. ఈ వారాంతం ముగిసేసరికి `రాజా శివాజీ` ఎంతటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.