ఈరోజు దాన్ని చూశా.. హీరోయిన్ మైండ్ బ్లాక్ కామెంట్..!
హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ అయ్యింది.
By: Ramesh Boddu | 27 Sept 2025 3:33 PM ISTహీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ అయ్యింది. నేను దాన్ని చూసి మైండ్ బ్లోన్ అయ్యా.. మీరు ఎప్పుడు చూస్తారా అని ఎగ్జైట్ అవుతున్నా అంటూ చెప్పి చెప్పకుండా విప్పి విప్పకుండా ఒక కామెంట్ పెట్టింది. ఐతే నిధి అగర్వాల్ పెట్టిన కామెంట్ కచ్చితంగా రాజా సాబ్ ట్రైలర్ గురించే అని ఆడియన్స్ కనిపెట్టారు. రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ సినిమా ట్రైలర్ ని విజయదశమి కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నారు.
థ్రిల్ చేస్తూనే ఎంటర్టైన్ మిస్ అవ్వకుండా..
ఈ ట్రైలర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించబోతున్నారు మేకర్స్. ఆల్రెడీ రాజా సాబ్ టీజర్ చూసే శాంపిల్ అదిరింది అనుకున్నారు. ఇక ట్రైలర్ లో మరికొన్ని డీటైల్స్ ఇవ్వనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే ప్రత్యేకమైన సినిమాగా రాజా సాబ్ వస్తుంది. ఈ సినిమాను మారుతి అటు థ్రిల్ చేస్తూనే ఎంటర్టైన్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా నిలిచేలా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఉంటుందట.
రాజా సాబ్ ట్రైలర్ చూసింది కాబట్టే నిధి అగర్వాల్ అలా ఊరించేలా ట్వీట్ చేసిందని అంటున్నారు. నిధి అగర్వాల్ ఈమధ్యనే హరి హర వీరమల్లు సినిమాతో సర్ ప్రైజ్ చేసింది. ఆమె రోల్ ఉన్నంతసేపు ఓకే అనిపించింది. ఐతే వీరమల్లు అంచనాలను అందుకోలేదు అందుకే తన హోప్స్ అన్నీ కూడా రాజా సాబ్ మీద పెట్టుకుంది.
సంక్రాంతి బరిలో ప్రభాస్ స్టామినా..
రాజా సాబ్ సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట. ఆల్రెడీ టీజర్ లోనే అది ప్రూవ్ చేశాడు థమన్. ప్రభాస్ రాజా సాబ్ సినిమా అసలైతే ఈ ఇయర్ డిసెంబర్ రిలీజ్ అవ్వాల్సింది కానీ అది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వాయిదా పడింది. 2026 జనవరి 9న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి బరిలో ప్రభాస్ తన మాస్ స్టామినా చూపించాలని వస్తున్నాడు. పోటీలో ఎంతమంది ఉన్నా ప్రభాస్ సినిమానే ఆడియన్స్ కి ఫస్ట్ ఆప్షన్ అనిపించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రాజా సాబ్ లో నిధి, మాళవిక ఇద్దరు హీరోయిన్స్ తమ టాలెంట్ చూపించనున్నారు. నిధి పాప మాత్రం ఈ సినిమా హిట్ పడితే మళ్లీ తెలుగులో వరుస సినిమాలు చేయాలని చూస్తుంది. ఇక మాళవిక విషయానికి వస్తే రాజా సాబ్ తోనే అమ్మడు తెలుగు ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటివరకు ఆమె నటించిన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని అలరించింది మాళవిక. రాజా సాబ్ సక్సెస్ అయితే మాళవికకు కూడా తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.
