Begin typing your search above and press return to search.

రాజాసాబ్.. ఏది రైట్?

టాలీవుడ్ నుంచి రాబోతున్న తర్వాతి భారీ చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి.

By:  Garuda Media   |   8 Aug 2025 7:00 PM IST
రాజాసాబ్.. ఏది రైట్?
X

టాలీవుడ్ నుంచి రాబోతున్న తర్వాతి భారీ చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ముందు ఈ చిత్రాన్ని వేసవిలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూట్ ఆలస్యం కావడంతో వాయిదా పడిపోయింది. అనుకున్న దాని కంటే చాలా ఆలస్యంగా డిసెంబరు 5న ఈ సినిమాను రిలీజ్ చేయాలని డిసైడయ్యారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ డేట్ కూడా మారిపోతుందని వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి రిలీజ్ గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. కానీ ఈసారి డేట్ మార్చడానికి కారణం.. చిత్రీకరణలో ఆలస్యం కాదు. అక్టోబరు చివరికల్లా సినిమా రెడీ అయిపోతుందని.. ఐతే సంక్రాంతి రిలీజ్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నామని నిర్మాత విశ్వ ప్రసాద్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి ఇలాంటి పెద్ద సినిమా రిలీజైతే బాగానే ఉంటుంది కానీ.. అది ఈ చిత్రంతో పాటు వేరే సినిమాల రెవెన్యూనూ దెబ్బ తీస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ స్థాయి సినిమాకు సంక్రాంతి రిలీజే కావాలా అన్నది ప్రశ్న.

ప్రభాస్ సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు పండగే. ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకు సోలో డేట్ ఉంటేనే బాగుంటుంది. సంక్రాంతి సినిమాలకు టాక్ బాగుంటే మామూలు కంటే కొంచెం ఎక్కువ వసూళ్లే వస్తాయన్నది వాస్తవం. కానీ ఆ సమయంలో పోటీ వల్ల థియేటర్లు తగ్గిపోతాయి. అవతల వేరే సినిమాలు కూడా బాగుంటే.. రెవన్యూ షేర్ అయిపోతుంది. ఇక టాక్ అటు ఇటుగా ఉంటే ఆ సినిమా మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. వచ్చే సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా.. రవితేజ-కిషోర్ తిరుమల చిత్రం.. అనగనగా ఒక రాజు చిత్రాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ‘రాజాసాబ్’ వస్తే వాటికి ఇబ్బంది తప్పదు. థియేటర్ల పరంగా ఘర్షణ తప్పదు. దాని బదులు డిసెంబరు 5న సినిమాను రిలీజ్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాక పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు భారీ రిలీజ్ దక్కుతుంది. పోటీయే ఉండదు. టాక్ బాగుంటే వసూళ్లు ఊహించని స్థాయిలో ఉంటాయి. ఇలాంటి భారీ చిత్రాలకు పండుగ డేట్ అవసరం లేదని.. ఈ చిత్రాలు ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ అని ఇండస్ట్రీ జనాలు అనే మాట అతిశయోక్తి కాదు. కాబట్టి డిసెంబరు మొదటి వారంలోనే ‘రాజా సాబ్’ను రిలీజ్ చేయడం మంచిదేమో.