రాజా సాబ్ దసరా గిఫ్ట్ ఏంటి..?
రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న థ్రిల్లర్ మూవీ రాజా సాబ్. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంచనాలను మించి సినిమా ఉంటుందని మేకర్స్ అంటున్నారు.
By: Ramesh Boddu | 26 Aug 2025 12:04 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న థ్రిల్లర్ మూవీ రాజా సాబ్. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంచనాలను మించి సినిమా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ సూపర్ అనిపించేసింది. మారుతి డైరెక్షన్లో సినిమా అనేసరికి ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడ్డారు కానీ టీజర్ చూశాక సినిమా మీద నమ్మకం పెంచుకున్నారు. థ్రిల్లర్ సినిమాల్లో ది బెస్ట్ మూవీగా నిలిచేలా రాజా సాబ్ వస్తుంది. ఐతే ఈ సినిమా థ్రిల్లింగ్ తో పాటు సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందట. టీజర్ లో ప్రభాస్ కామెడీ కూడా అదిరిపోయింది.
సంక్రాంతి బరిలో రాజా సాబ్..
ఇక డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ పై మరోసారి నిర్మాతలు ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. సినిమాను సంక్రాంతి బరిలో తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారట. ఫ్యాన్స్ కూడా ఎలాగు ఇన్నాళ్లు ఆగాం కాబట్టి పొంగల్ కి సినిమా ఫిక్స్ చేయండని అంటున్నారు. ఐతే డిసెంబర్ రిలీజైతే హిందీలో మార్కెట్ బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఐతే ఫైనల్ అప్డేట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.
ఐతే రాజా సాబ్ సినిమా నుంచి దసరా కి ఒక స్పెషల్ అప్డేట్ రాబోతుందట. సినిమా నుంచి సాంగ్ ఒకటి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దానితో పాటు మరో టీజర్ కూడా దసరాకి వస్తుందని టాక్. ఫస్ట్ టీజర్ తో సినిమా శాంపిల్ చూపించిన మారుతి సెకండ్ టీజర్ లో ఇంకాస్త డీటైల్స్ ఇస్తారని టాక్.
థమన్ మ్యూజిక్ ఎట్రాక్షన్..
ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతుంది. థ్రిల్లర్ సినిమాలకు థమన్ బిజిఎం సెపరేట్ మార్క్ సెట్ చేస్తుంది. రాజా సాబ్ కి కూడా థమన్ మ్యూజిక్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ మారుతి థమన్ కలిసి ఇదివరకు సినిమాలు చేశారు. మరోసారి ఇద్దరి కాంబో సినిమాగా రాజా సాబ్ వస్తుంది.
రాజా సాబ్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బిజినెస్ కూడా అదరగొట్టేస్తుంది. సినిమా విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. రాజా సాబ్ సినిమా లో ప్రభాస్ స్టైలిష్ లుక్స్ తో పాటు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, కామెడీ టైమింగ్ కూడా అదిరిపోతాయని అంటున్నారు. మారుతి ఈ సినిమా హిట్టు కొట్టి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు.
