Begin typing your search above and press return to search.

రాజా సాబ్ ప్రభాస్ ఎనర్జీ కోసం ఫ్యాన్స్ రిపీట్ మోడ్..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి నుంచి ఆయన సినిమాల స్టామినా వసూళ్లు చేస్తున్న కలెక్షన్స్ చూసి ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.

By:  Ramesh Boddu   |   25 Nov 2025 3:00 PM IST
రాజా సాబ్ ప్రభాస్ ఎనర్జీ కోసం ఫ్యాన్స్ రిపీట్ మోడ్..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి నుంచి ఆయన సినిమాల స్టామినా వసూళ్లు చేస్తున్న కలెక్షన్స్ చూసి ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఐతే సలార్ వరకు ప్రభాస్ అన్నీ సీరియస్ రోల్స్ చేస్తున్నాడని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. డార్లింగ్ టైం నాటి ప్రభాస్ ని చూడాలని.. బుజ్జిగాడు లాంటి పంచులు వేయాలని కోరుతున్నారు. అందుకే మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తూ ఫ్యాన్స్ కోరిక తీర్చేందుకు సిద్ధమయ్యాడు ప్రభాస్.

ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో..

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎనర్జీ విషయంలో ప్రభాస్ ని చూసి అందరు షాక్ అవుతారని అంటున్నారు. ప్రభాస్ రాజా సాబ్ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఎగ్జైట్మెంట్ కలిగిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ తన సీరియస్ మోడ్ నుంచి కామెడీకి షిఫ్ట్ అయ్యాడు. తన టైమింగ్, కామెడీతోనే ఫ్యాన్స్ ని ఖుషి చేయబోతున్నాడని టాక్.

ప్రభాస్ యాక్షన్ సీన్స్ చేయడం కామనే కానీ ఎంటర్టైనింగ్ సీన్స్ ని ఫ్యాన్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో రాజా సాబ్ లోని ప్రభాస్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ రిపీటెడ్ ఫుట్ ఫాల్స్ పడేలా ఉంటాయట. రెబల్ స్టార్ సినిమా అంటేనే ఫ్యాన్స్ కి ఫీస్ట్ అన్నట్టే. ఇక ఆ సినిమా అంచనాలకు తగినట్టుగా వస్తే మాత్రం ఇక ఆ రేంజ్ వేరే అని చెప్పొచ్చు. కల్కి 2898 ఏడి తర్వాత ప్రభా రాజా సాబ్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

ప్రభాస్ డిఫరెంట్ రోల్స్ తో సర్ ప్రైజ్..

ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకునే ప్లాన్ లో ఉన్నాడు. రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ రోల్స్ తో సర్ ప్రైజ్ చేస్తారట. అంతేకాదు రెబల్ స్టార్ సరసన అందమైన భామలు మాళవిక, నిధి అగర్వాల్ కూడా సినిమాకు మరింత ఎనర్జీ తెస్తాయని తెలుస్తుంది. సో రెబల్ స్టార్ రెబలిజం మాత్రమే కాదు ఎంటర్టైనింగ్ మోడ్ తో కూడా ఫ్యాన్ ఫీస్ట్ అందించేందుకు రాజా సాబ్ వస్తున్నాడని అంటున్నారు.

రాజా సాబ్ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటే ప్రభాస్ హను రాఘవపూడి తో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సందీప్ వంగ స్పిరిట్ కూడా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాలతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ పై తన మార్క్ చూపించబోతున్నాడని చెప్పొచ్చు.