Begin typing your search above and press return to search.

యూఎస్ రెస్టారెంట్ లో రాజా సాబ్ పైరసీ షో..!

అసలే స్టార్ సినిమాల నిర్మాతలు పెట్టిన బడ్జెట్ ని రికవర్ చేసుకునేందుకు నానాపాట్లు పడుతుంటే ఈ పైరసీ భూతం వాళ్ల ఆశలకు అడ్డుకట్టు వేస్తుంది.

By:  Ramesh Boddu   |   10 Jan 2026 12:02 PM IST
యూఎస్ రెస్టారెంట్ లో రాజా సాబ్ పైరసీ షో..!
X

అసలే స్టార్ సినిమాల నిర్మాతలు పెట్టిన బడ్జెట్ ని రికవర్ చేసుకునేందుకు నానాపాట్లు పడుతుంటే ఈ పైరసీ భూతం వాళ్ల ఆశలకు అడ్డుకట్టు వేస్తుంది. సంక్రాంతి సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ శుక్రవారం రిలీజైంది. ఈ సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం అలా పైరసీ ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. ఐతే ఈ పైరసీ ప్రింట్ ని యూఎస్ లో ఏకంగా ఒక రెస్టారెంట్ లో ప్లే చేయడం షాకింగ్ న్యూస్ గా మారింది.

డబ్లిన్ సిటీలో నార్త్ ఇండియన్ రెస్టారెంట్..

యూఎస్ లోని డబ్లిన్ సిటీలో నార్త్ ఇండియన్ రెస్టారెంట్ ఓహియో స్టేట్ ఆఫ్ యూఎస్ లో రాజా సాబ్ పైరసీ వెర్షన్ అక్కడ టీవీల్లో ప్రసారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అది వైరల్ అవ్వడంతో విషయం తెలుసుకున్న ఆడియన్స్ షాక్ అవుతున్నారు. రాజా సాబ్ సినిమాకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. మారుతి సినిమాను ఆశించిన రేంజ్ లో తెరకెక్కించలేదని ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు.

ఓ పక్క సినిమాకు ఈ మిక్సెడ్ టాక్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ మేకర్స్ కి ఉంటే.. యూఎస్ రెస్టారెంట్ లో ఏకంగా పైరసీ ప్రింట్ ని టీవీల్లో వేయడం పట్ల నిర్మాతలు షాక్ అయ్యారు. స్టార్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో తీసే సినిమాలు ఇలా రిలీజ్ అయిన తెల్లారే పైరసీ వస్తే ఇక థియేటర్లు వెళ్లి జనాలు సినిమా చూసే పరిస్థితి ఉండదు.

పైరసీ సైట్స్ మాత్రం రెచ్చిపోతున్నాయి..

ఈమధ్యనే ఇలాంటి పైరసీ వెబ్ సైట్ ని నడిపిస్తున్న రవి ని అరెస్ట్ చేశారు. రవి అరెస్ట్ తో ఐబొమ్మ సైట్ ఆగిపోయింది. కానీ ఐబొమ్మ రవి ఆగిపోయాడు కానీ మిగతా పైరసీ సైట్స్ మాత్రం రెచ్చిపోతున్నాయి. ఇలా సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం ఎలాగోలా దాన్ని పైరసీ చేసి రిలీజ్ చేస్తున్నారు. యూఎస్ రెస్టారెంట్ ఇష్యూపై నిర్మాతలు సీరియస్ లీగల్ యాక్షన్ కి రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే రాజా సాబ్ చుట్టూ జరుగుతున్న ఈ ఇష్యూస్ పై అప్సెట్ గా ఉన్నారు. సినిమాలో ప్రభాస్ తన బెస్ట్ ఇవ్వగా రాజా సాబ్ సినిమాకు మిశ్రమ స్పందన రావడం అది చాలదు అన్నట్టు పైరసీ ప్రింట్ లీక్ అవ్వడం ఫ్యాన్స్ ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.

పైరసీ మీద ప్రభుత్వం, సినీ మేకర్స్ ఒక నిర్ధిష్టమైన నిర్ణయానికి వస్తే తప్ప ఇలాంటి ఘోరాలు ఆపే ఛాన్స్ ఉండదు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే అది కాస్త ఇలా పైరసీ అయ్యి జనాలకు చూపిస్తే నిర్మాత నష్టాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఐతే ఈ పైరసీ ఇష్యూ ఎప్పటి నుంచో సినీ పరిశ్రమకు హెడేక్ గా మారుతుంది. అందుకే దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే.