Begin typing your search above and press return to search.

రాజ‌మౌళిని ఫాలో అవుతున్న మారుతి

ఈ కార‌ణంతోనే త‌మ సినిమాల‌ను చాలా భారీగా ప్లాన్ చేస్తుంటారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. రాజ‌మౌళి సైతం ఇదే ఫాలో అవుతూ ఉంటారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 Nov 2025 11:09 AM IST
రాజ‌మౌళిని ఫాలో అవుతున్న మారుతి
X

ఎంత పెద్ద స్టార్ న‌టించిన సినిమాల‌కైనా స‌రే ప్ర‌మోష‌న్స్ అనేవి చాలా కీల‌కం. ప్ర‌మోష‌న్స్ స‌రిగా చేస్తేనే ఆ సినిమా గ్రౌండ్ లెవెల్ వ‌ర‌కు వెళ్తుంది. అప్పుడే సినిమాల‌కు మంచి ఓపెనింగ్స్ తో పాటూ భారీ క‌లెక్ష‌న్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది. ఈ కార‌ణంతోనే త‌మ సినిమాల‌ను చాలా భారీగా ప్లాన్ చేస్తుంటారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. రాజ‌మౌళి సైతం ఇదే ఫాలో అవుతూ ఉంటారు.

ఏ సినిమా అయినా స‌రే రిలీజవ‌క ముందు వ‌ర‌కే మ‌న చేతుల్లో ఉంటుంద‌ని, ఏం చేసినా రిలీజ్ ముందు వ‌రకే చేయగ‌ల‌మ‌ని, ఒక్క‌సారి సినిమా థియేట‌ర్లలో రిలీజై, ఆడియ‌న్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాక ఏం చేయ‌లేమ‌ని.. అందుకే వీలైనంత భారీగా త‌న సినిమాను ప్ర‌మోట్ చేస్తాన‌ని రాజమౌళి ఎన్నో సంద‌ర్భాల్లో చెప్పారు. రాజ‌మౌళిని ఆద‌ర్శంగా తీసుకుని ఎంతోమంది అదేవిధంగా త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చారు కూడా.

జ‌న‌వ‌రి 9న రాజా సాబ్ రిలీజ్

సినిమా స‌క్సెస్ లో ప్ర‌మోష‌న్స్ అంత‌టి కీల‌క పాత్ర పోషిస్తాయి. ఇక అస‌లు విష‌యానికొస్తే ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమా జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ప్ప‌టికీ మేక‌ర్స్ ఇంకా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళ‌న చెందుతున్నారు. ఇలాంటి టైమ్ లో రాజా సాబ్ ప్ర‌మోష‌న్స్ గురించి ఓ అప్డేట్ తెలుస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో ప్ర‌మోష‌న్స్

రాజా సాబ్ కోసం మేక‌ర్స్ అన్ని భాష‌ల ఆడియ‌న్స్ ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌మోష‌న్స్ ను ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీని కోసం రాజా సాబ్ టీమ్, రాజ‌మౌళి మార్కెటింగ్ ఎక్స్‌ప‌ర్ట్స్ ను సంప్ర‌దించార‌ని, ఈ సినిమా కోసం మారుతి ప్ర‌మోష‌న్స్ విష‌యంలో రాజ‌మౌళిని ఫాలో అవుతున్నార‌ని, రాజా సాబ్ కు ప్రీ రిలీజ్ హైప్ ను పెంచేందుకు మేక‌ర్స్ పాన్ ఇండియా స్థాయిలో ప్ర‌మోష‌న్స్ ను ప్లాన్ చేశాని తెలుస్తోంది. అందులో భాగంగానే ముందుగా సాంగ్స్ ను రిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే రాజా సాబ్ సాంగ్స్ పూర్తయి పోయి, రిలీజ్ కు రెడీగా ఉన్నాయ‌ని తెలుస్తోంది.

మూడో వారంలో ఫ‌స్ట్ సింగిల్

న‌వంబ‌ర్ నెల మూడో వారం ఫ‌స్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి, ఆ త‌ర్వాత ప్ర‌తి పది రోజుల‌కూ ఓ కొత్త సాంగ్ ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. వీటితో పాటూ ట్రైల‌ర్ ను న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రిలీజ్ చేయాల‌ని, దానికంటే ముందు క్రిస్మ‌స్ కు యూఎస్ లో ఓ స్పెష‌ల్ ఈవెంట్ ను ప్లాన్ చేసి విదేశాల్లోని ప్ర‌భాస్ ఫ్యాన్స్ ను కూడా ఖుషీ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఇదే జ‌రిగితే రాజా సాబ్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని ఏరియాల్లోనూ మంచి హైప్ ఏర్ప‌డి సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్ నెల‌కొన‌డం ఖాయం.