Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాల రేట్ల పంచాయితీ.. హైకోర్టులో నేడే అసలు నిర్ణయం!

సంక్రాంతి సినిమాల సందడి మొదలవక ముందే టికెట్ రేట్ల పంచాయితీ కోర్టు మెట్లు ఎక్కింది.

By:  M Prashanth   |   7 Jan 2026 9:00 AM IST
సంక్రాంతి సినిమాల రేట్ల పంచాయితీ.. హైకోర్టులో నేడే అసలు నిర్ణయం!
X

సంక్రాంతి సినిమాల సందడి మొదలవక ముందే టికెట్ రేట్ల పంచాయితీ కోర్టు మెట్లు ఎక్కింది. ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రాలు కొన్ని రోజుల గ్యాప్ లోనే రిలీజ్ అవుతుండటంతో ఆడియన్స్ లో మామూలు క్రేజ్ లేదు. ఈ సినిమాల మీద వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అందుకే పండుగ సీజన్ లో ఉన్న డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలని, టికెట్ రేట్ల పెంపుతో పాటు ఎర్లీ మార్నింగ్ షోల పర్మిషన్ల కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

ఆల్రెడీ ఈ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను మేకర్స్ సంప్రదించారు. అయితే తెలంగాణలో మాత్రం టికెట్ రేట్లు పెంచుకోవడానికి పాత కోర్టు ఆర్డర్స్ అడ్డంకిగా మారాయి. అందుకే రాజా సాబ్, MSG ప్రొడ్యూసర్లు స్పెషల్ గా పిటిషన్లు వేయాల్సి వచ్చింది. ఫెస్టివల్ టైమ్ లో జనాలు ఎగబడతారు కాబట్టి రేట్లు పెంచితేనే తమ ఇన్వెస్ట్ మెంట్ రికవర్ అవుతుందని వారు భావిస్తున్నారు.

గత ఏడాది అఖండ 2 సినిమా టైమ్ లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లను హైకోర్టు తప్పుబట్టింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్లు పెంచకూడదని ఒక సింగిల్ బెంచ్ జడ్జి స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇచ్చారు. కోర్టు ఆదేశాలను పదే పదే లైట్ తీసుకోవద్దని అప్పుడు వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు టీజీ ప్రభుత్వం కూడా కోర్టు డైరెక్షన్స్ లేకుండా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది.

ఈ చిక్కుముడిని విప్పడానికి నిర్మాతలు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించి పాత ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేయాలని కోరారు. టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చేలా హోమ్ సెక్రటరీని ఆదేశించాలని రిక్వెస్ట్ చేశారు. మంగళవారమే ఈ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉన్నా కోర్టు దాన్ని బుధవారానికి వాయిదా వేసింది. అంటే ఈరోజు వెలువడే తీర్పు ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్ పై భారీ ప్రభావం చూపనుంది.

ఒకవేళ కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ప్రభాస్ సినిమాకి, చిరంజీవి మూవీకి అది పెద్ద ప్లస్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ తో రాజా సాబ్ రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తుంటే, మెగాస్టార్ తన ఎంఎస్వీపీతో బాక్సాఫీస్ ని షేక్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు. కోర్టు సానుకూలంగా స్పందిస్తే ప్రభుత్వం వెంటనే జీవోలు ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో వసూళ్ల లెక్కలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

పండుగకి ఇంకో కొన్ని రోజులే టైమ్ ఉండటంతో ఈరోజు వచ్చే జడ్జిమెంట్ పై అటు ఇండస్ట్రీ వర్గాలు, ఇటు అభిమానులు టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. టికెట్ బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది కూడా దీని మీదనే డిపెండ్ అయి ఉంది. హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఈ మధ్యాహ్నం కల్లా క్లారిటీ వచ్చేస్తుంది. ఏదేమైనా ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో తెలియాలంటే ఈ తీర్పు చాలా ముఖ్యం.