ఎట్టకేలకు గుడ్‌న్యూస్ చెప్పిన రాజా సాబ్ టీమ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న సినిమా ది రాజా సాబ్.
By: Sravani Lakshmi Srungarapu | 21 Nov 2025 1:17 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న సినిమా ది రాజా సాబ్. హార్రర్ మూవీస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ పలు కారణాల వల్ల ఎన్నో సార్లు వాయిదా పడుతూ ఆఖరికి జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతూ వచ్చారు.
ఈసారైనా చెప్పిన డేట్ కు సినిమా రిలీజవుతుందా లేదా అని అనుమానపడిన వారు కూడా ఉన్నారు. అయితే వారందరి అనుమానాలకు చెక్ పెడుతూ మేకర్స్ రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ ను అనౌన్స్ చేశారు. రాజాసాబ్ నుంచి ఈ ఫస్ట్ సింగిల్ ప్రభాస్ బర్త్ డే రోజునే రిలీజ్ కానుందని అన్నారు. కానీ తెలియని కారణాల వల్ల అప్పుడు ఆ సాంగ్ రిలీజవలేదు.
నవంబర్ 23న రాజా సాబ్ ఫస్ట్ సింగిల్
మళ్లీ తర్వాత కూడా అదుగో ఫస్ట్ సింగిల్ ఇదుగో ఫస్ట్ సింగిల్ అన్నారు తప్పించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడు మేకర్స్ రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ గురించి ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్ నవంబర్ 23వ తేదీన రిలీజ్ కానున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. ఈ సాంగ్ లో ప్రభాస్ స్టైల్, రెబల్ సాబ్ స్వాగ్, రాజా సాబ్ వైబ్ తో పాటూ తమన్ మ్యూజికల్ మ్యాజిక్ కూడా ఉంటుందని డైరెక్టర్ మారుతి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
డిసెంబర్ 25 కల్లా ఫస్ట్ కాపీ రెడీ
నవంబర్ 23న ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి, ఆ తర్వాత వరుసగా మిగిలిన సాంగ్స్ ను కూడా రిలీజ్ చేయాలని, సినిమాను కూడా డిసెంబర్ 25 నాటికల్లా ఫస్ట్ కాపీని రెడీ చేసి, ఇకపై పూర్తి స్థాయి ప్రమోషన్స్ ను నిర్వహించి, రాజా సాబ్ ను గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్ కు కూడా రీచ్ అయ్యేలా చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మొత్తం 5 సాంగ్స్ ఉన్నాయని సమాచారం. మొదటి సారి ప్రభాస్ హార్రర్ కామెడీ జానర్ లో సినిమా చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది.
