Begin typing your search above and press return to search.

ది రాజాసాబ్ కి ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్స్ అన్నీ బంద్!

రెబల్ స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ది రాజా సాబ్.

By:  Madhu Reddy   |   27 Dec 2025 3:28 PM IST
ది రాజాసాబ్ కి ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్స్ అన్నీ బంద్!
X

రెబల్ స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ది రాజా సాబ్. వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో రిద్దీ కుమార్ , నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు మలయాళ బ్యూటీ మాళవిక ఈ సినిమా ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.




ఇకపోతే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో డిసెంబర్ 27న అనగా ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు.కూకట్పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇకపోతే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఇదే గ్రౌండులో దాదాపు 220 అడుగుల భారీ కటౌట్ ని కూడా ఏర్పాటు చేసి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

నిజానికి మీడియాకు దూరంగా ఉండే ప్రభాస్ అభిమానుల కోసం దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ పబ్లిక్ వేదిక పైకి రానున్నారు. వాస్తవానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ సలార్ సినిమాకి ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ చేశారు. ఆ తర్వాత కల్కి సినిమాకి మాత్రం బుజ్జిని పరిచయం చేస్తూ సందడిగా కనిపించారు ప్రభాస్. కానీ మరో ఈవెంట్లో కనిపించలేదు. వాస్తవానికి బహిరంగ వేదికలపై కనిపించడానికి ఇష్టపడని ప్రభాస్.. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ ది రాజా సాబ్ సినిమా కోసం పబ్లిక్ ముందుకు రాబోతున్నారు..

దీంతో ఈ వేదికపై ప్రభాస్ ఎలా కనిపించనున్నారు? ఎలాంటి స్పీచ్ ఇవ్వనున్నారు అనే విషయంపై ఉత్సుకత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆయనను చూడడానికి అభిమానులు, పబ్లిక్ పెద్ద ఎత్తున తరలివస్తారనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే జనాలను అదుపు చేయడానికి.. ప్రయాణికుల ప్రయాణాన్ని సుగమం చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధిస్తూ కొన్ని షరతులు విధించారు.

రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా ఈరోజు రాత్రికి భారీగా ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా కొన్ని మార్గాలను మూసివేస్తూ.. వాటికి ప్రత్యామ్నాయంగా మరికొన్ని మార్గాలలో ప్రయాణికులు ప్రయాణించేలా ట్రాఫిక్ పోలీసులు కొన్ని మార్గాలను సూచిస్తూ.. ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇక మూసి వేసే మార్గాల విషయానికి వస్తే.. మూసాపేట్.. దీనికి ప్రత్యామ్నాయంగా హఫీజ్ పేట్, KPHB గుండా ప్రయాణికులు వెళ్లాలని సూచించారు. అలాగే మాదాపూర్ ని మూసి వేస్తూ.. దీనికి ప్రత్యామ్నాయంగా కైతలాపూర్ గ్రౌండ్స్ ఫ్లై ఓవర్ ద్వారా ప్రయాణించాల్సిందిగా కోరారు. అలాగే కూకట్పల్లి ఐడిఎల్ లేక్ నుండీ కైతలాపూర్ ఫ్లై ఓవర్ రూట్ ను ఉపయోగించుకోవాలని తెలిపారు.

శ్రేయాస్ మీడియా నిర్వహిస్తున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా ఉండడానికి పోలీసులు ఇలాంటి ఆంక్షలు విధించారు. అప్రమత్తంగా ఉండి ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని పొందాలని తెలిపారు.