Begin typing your search above and press return to search.

రాజాసాబ్ బాక్సాఫీస్: రీసెంట్ సినిమాలతో పోలిస్తే..

మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

By:  M Prashanth   |   12 Jan 2026 2:06 AM IST
రాజాసాబ్ బాక్సాఫీస్: రీసెంట్ సినిమాలతో పోలిస్తే..
X

సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ అందుకుంటోంది. మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సినిమాపై మిశ్రమ స్పందన వినిపిస్తున్నప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సెంటర్లలో రెండో రోజు కూడా మంచి షేర్ వసూలు చేయడం విశేషం.

ముఖ్యంగా ఏపీ, తెలంగాణ ఏరియాల్లో రాజా సాబ్ రెండో రోజు సుమారు 13.5 కోట్ల షేర్ సాధించింది. ఈ ఏడాది విడుదలైన ఇతర భారీ చిత్రాలతో పోల్చి చూస్తే ఇది బెస్ట్ ఓపెనింగ్. టాక్ మిక్స్డ్ గా ఉన్నప్పటికీ ప్రభాస్ కి ఉన్న క్రేజ్, సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ ఈ సినిమాకు బాగా కలిసి వస్తోంది. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సెలవుల్లో వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తున్నారు.

ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాల రెండో రోజు కలెక్షన్లతో పోలిస్తే రాజా సాబ్ ముందంజలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ రెండో రోజు 12.2 కోట్ల షేర్ రాబట్టగా రాజా సాబ్ ఆ మార్కును అధిగమించాడు. ఇక వార్ 2 చిత్రం 9.3 కోట్ల వద్ద ఆగిపోయింది. గతంలో సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం 8.5 కోట్లు, రీసెంట్ గా వచ్చిన గేమ్ ఛేంజర్ 8.2 కోట్ల షేర్ అందుకున్నాయి. హరిహర వీరమల్లు విషయానికి వస్తే అది 3.8 కోట్ల షేర్ కే పరిమితమైంది.

ప్రస్తుతం బాక్సాఫీస్ ట్రెండ్ చూస్తుంటే రెండో రోజు కంటే మూడో రోజున రాజా సాబ్ వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండేలా కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ సెలవు రోజు కావడంతో థియేటర్ల దగ్గర సందడి మరింత పెరిగింది. మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ మార్కును తాకిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలా నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. సెకండ్ హాఫ్ పై వస్తున్న విమర్శలను పక్కన పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తుండటం మేకర్స్ కు పెద్ద ఊరట.

ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంటున్నాడు. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టడం ప్రభాస్ కి అలవాటే అయినా ఈసారి పోటీ గట్టిగా ఉండటంతో ప్రతి రోజు వచ్చే నంబర్లు కీలకంగా మారాయి. రాబోయే రోజుల్లో మెగాస్టార్ సినిమా కూడా పోటీలోకి రానున్న తరుణంలో ఈ లోపే వీలైనంత ఎక్కువ మొత్తాన్ని రాబట్టాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ సినిమాల రెండో రోజు షేర్ వివరాలు ఇలా ఉన్నాయి:

ది రాజా సాబ్: రూ.13.5 కోట్లు

ఓజీ: రూ.12.2 కోట్లు

వార్ 2: రూ.9.3 కోట్లు

గుంటూరు కారం: రూ.8.5 కోట్లు

గేమ్ ఛేంజర్: రూ.8.2 కోట్లు

హరిహర వీరమల్లు: రూ.3.8 కోట్లు