Begin typing your search above and press return to search.

రెబల్ రాజా సాబ్.. కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడా..?

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మారుతి డైరెక్షన్ లో తెరకెకుతున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   25 Oct 2025 4:00 PM IST
రెబల్ రాజా సాబ్.. కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడా..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మారుతి డైరెక్షన్ లో తెరకెకుతున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2026 సంక్రాంతి రేసులో దిగుతున్న రాజా సాబ్ సినిమా ట్రైలర్ ఆల్రెడీ రిలీజైంది. సినిమా కోసం మరో ట్రైలర్ ని రెడీ చేస్తున్నాడట డైరెక్టర్ మారుతి. ఐతే రాజా సాబ్ రెండో ట్రైలర్ సినిమాలో సీన్స్ తో కాకుండా కాన్సెప్ట్ వీడియో చేస్తున్నారట.

సినిమాకు శాంపిల్ గా ఎలా ఉంటుందో..

కల్కి 2898 AD సినిమా కోసం నాగ్ అశ్విన్ ఎలాగైతే పాత్రలను పరిచయం చేస్తూ ఎలా అయితే ఒక సీరీస్ రిలీజ్ చేశాడో ఇప్పుడు మారుతి కూడా సినిమాలో లేని సీన్స్ తో.. ప్రత్యేకంగా ఒక స్పెషల్ ట్రైలర్ రెడీ చేస్తారట. ఇందుకోసం సెపరేట్ షూటింగ్ కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ఇది క్లిక్ అయితే మాత్రం ఇక మీదట అందరు ఇదే ఫార్ములా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది.

అసలైతే సినిమా ట్రైలర్ అంటే సినిమాకు శాంపిల్ గా ఎలా ఉంటుందో అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ రాజా సాబ్ టీం మాత్రం సినిమా కాన్సెప్ట్ ని డిఫరెంట్ గా ప్రమోట్ చేయబోతున్నారట. తప్పకుండా ఈ అటెంప్ట్ సంథింగ్ డిఫరెంట్ గా ఉండే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. రాజా సాబ్ కోసం మారుతి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.

రాజా సాబ్ ఫ్రాంచైజీగా..

ఈ సినిమాతో సక్సెస్ అందుకుని ప్రభాస్ తో మరో సినిమా అది రాజా సాబ్ ఫ్రాంచైజీగా తీయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు మారుతి. పీపుల్ మీడియా మాత్రం మారుతికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సినిమా బాగా వచ్చేందుకు ఎంత బడ్జెట్ అయినా పెట్టేందుకు రెడీ అనేస్తున్నారు. సో రాజా సాబ్ తో మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో జాయిన్ అవుతున్నాడన్నమాట. సంక్రాంతికి వస్తున్న రాజా సాబ్ భారీ టార్గెట్ తో దిగుతుంది.

రాజా సాబ్ సినిమాలో థమన్ మ్యూజిక్ కూడా మేజర్ హైలెట్ అయ్యేలా ఉంటుందట. సినిమా కాన్సెప్ట్ కు థమన్ బిజిఎం మరింత క్రేజీగా ఉంటుందని తెలుస్తుంది. మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న రాజా సాబ్ నిజంగానే రెబల్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తుందా లేదా అన్నది సంక్రాంతి రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే. రాజా సాబ్ రెండో ట్రైలర్ పై సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. సినిమాలో లేని సీన్స్ తో ట్రైలర్ అంటే ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ పెరిగింది. మరి మారుతి ఈ అటెంప్ట్ ని ఎలా తీసుకొస్తారన్నది చూడాలి.