Begin typing your search above and press return to search.

రాజసాబ్.. ఓ అందమైన క్లిక్..

తాజాగా మేకర్స్ క్రేజీ ఫోటో షేర్ చేశారు. సెట్స్ లో తీసిన పిక్ ను రాజసాబ్ డైరీస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

By:  M Prashanth   |   16 Oct 2025 7:49 PM IST
రాజసాబ్.. ఓ అందమైన క్లిక్..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో ది రాజా సాబ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ను నిర్వహిస్తున్నారు.

మోస్ట్ అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న రాజా సాబ్ లో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వారితో పాటు అనేక మంది నటీనటులు సినిమాలో ఇతర పాత్రల్లో యాక్ట్ చేస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న రాజా సాబ్ మూవీ నుంచి రీసెంట్ గా మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. డార్లింగ్ హీరో ప్రభాస్ పుట్టినరోజు కానుకగా తీసుకు రానున్నారు. రీసెంట్ గా తమన్ కూడా అక్టోబర్ 23 మ్యూజికల్ ట్రీట్ పెరుగుతుంది అంటూ గ్రాఫ్ చూపిస్తూ ఫ్యాన్స్ లో మరింత ఎగ్జైట్మెంట్ పెంచారు.

తాజాగా మేకర్స్ క్రేజీ ఫోటో షేర్ చేశారు. సెట్స్ లో తీసిన పిక్ ను రాజసాబ్ డైరీస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో హీరో, హీరోయిన్, డైరెక్టర్, డీఓపీ, ప్రొడ్యూసర్ అంటూ రాసి ఉన్న చైర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆ పిక్ తీసిన ప్లేస్ చాలా అందంగా ఉంది. గ్రీనరీతో అదిరిపోయింది. అందరినీ ఇట్టే ఆకట్టుకుంటోంది.

అయితే త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుండగా.. సాంగ్ షూటింగ్ టైంలో తీసిన పిక్ ను మేకర్స్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు నెటిజన్లు, అభిమానులు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. బ్యూటిఫుల్ క్లిక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పిక్ చూస్తుంటే ముందున్న రోజులు మరింత ఎగ్జైటింగ్‌ గా ఉండబోతున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ఫోటో డైరీస్ లోని పెర్ఫెక్ట్ పిక్ అని చెబుతున్నారు.

అదే సమయంలో నిధి అగర్వాల్ పోస్ట్ చేసిన పిక్ కూడా సూపర్ అని అంటున్నారు. సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఆమె.. హీరోయిన్ అని రాసి ఉన్న చైర్ పిక్ ను పోస్ట్ చేశారు. రెండు లవ్ సింబల్స్ ఎమోజీలను క్యాప్షన్ గా ఇచ్చారు. అయితే ఫస్ట్ సింగిల్.. ప్రభాస్, నిధి అగర్వాల్ పైన ఉంటుందని ఇప్పుడు కొందరు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మొత్తానికి రాజాసాబ్ మేకర్స్ తో పాటు నిధి పోస్టులు ట్రెండింగ్ లో ఉన్నాయి.