రాజాసాబ్ Vs జననాయగన్.. US బుకింగ్స్ సంగతేంటి?
ఏదేమైనా జన నాయగన్, ది రాజా సాబ్.. రెండు సినిమాలు కూడా అమెరికాలో స్ట్రాంగ్ ప్రీమియర్ ఓపెనింగ్ కు సిద్ధమవుతున్నాయి.
By: M Prashanth | 31 Dec 2025 11:09 AM ISTసంక్రాంతి పండుగ కానుకగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్, కోలీవుడ్ విజయ్ దళపతి జన నాయగన్ సినిమాలు.. మరో తొమ్మిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. వాటితోనే పొంగల్ సందడి మొదలు కానుండగా.. జనవరి 9వ తేదీన రిలీజ్ అవ్వనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజే విడుదలవుతున్నాయి.
ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ప్రీమియర్ షోస్ కూడా ఉండడంతో అద్భుతమైన స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా తొమ్మిది రోజులు సమయం ఉండగానే.. ఆ రెండు సినిమాల ప్రీమియర్ ప్రీ-సేల్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
జన నాయగన్ సినిమా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి జోరు చూపిస్తోంది. ఇప్పటివరకు ఆ సినిమా 195 లొకేషన్లలో, 419 ప్రీమియర్ షోల ద్వారా, మొత్తం 2,30,614 డాలర్లు వసూలు చేసింది. అలాగే 11,291 టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. ఇంకా కొత్త లొకేషన్లు, షోలు ఓపెన్ అవుతూనే ఉండటం గమనార్హం.
మొత్తం నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ కలెక్షన్లు ఇప్పటికే 3 లక్షల డాలర్ల మార్క్‌ను దాటాయి. బుకింగ్స్ ఇప్పటికీ పెరుగుతూనే ఉండటం ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రచారం మరింత పెరిగే అవకాశం ఉండటంతో, చివరి వారం భారీ జంప్ కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు ది రాజా సాబ్ సినిమా కొంచెం భిన్నమైన వ్యూహంతో ముందుకెళ్తోంది. అమెరికాలో పెద్ద స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న రాజా సాబ్.. ఇప్పటివరకు 342 లొకేషన్లలో, ఏకంగా 1,021 ప్రీమియర్ షోలతో, 2,80,619 డాలర్లు వసూలు చేసింది. టికెట్ పరంగా చూస్తే ఇప్పటివరకు 9,899 అమ్ముడయ్యాయి.
మొత్తం నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ కలెక్షన్లు సుమారు 2.9 లక్షల డాలర్లకు చేరుకున్నాయి. టికెట్ల సంఖ్య జన నాయగన్ తో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, భారీ షో కౌంట్ మాత్రం డిస్ట్రిబ్యూటర్ల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది. గత అనుభవాలను బట్టి చూస్తే, ఇలాంటి సినిమాలు చివరి వారం బుకింగ్స్ లో భారీగా పెరుగుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏదేమైనా జన నాయగన్, ది రాజా సాబ్.. రెండు సినిమాలు కూడా అమెరికాలో స్ట్రాంగ్ ప్రీమియర్ ఓపెనింగ్ కు సిద్ధమవుతున్నాయి. ఒకటి నిలకడైన బుకింగ్ ట్రెండ్ తో ముందుకెళ్తుంటే, మరొకటి భారీ స్కేల్ తో చివరి వారం దూకుడుకు రెడీ అవుతోందియ ఇంకా సమయం ఉండటంతో, రాబోయే రోజుల్లో రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ నెంబర్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
