Begin typing your search above and press return to search.

స‌మంత భ‌ర్త రాజ్ లో ఈ టాలెంట్ కూడా ఉందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత, నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న తర్వాత బాలీవుడ్ డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Sravani Lakshmi Srungarapu   |   11 Dec 2025 7:03 PM IST
స‌మంత భ‌ర్త రాజ్ లో ఈ టాలెంట్ కూడా ఉందా?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత, నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న తర్వాత బాలీవుడ్ డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వార్త‌ల‌పై ఎప్పుడూ స్పందించ‌ని రాజ్, స‌మంత రీసెంట్ గా డిసెంబ‌ర్ 1న కోయంబ‌త్తూరులోని ఇషా ఫౌండేష‌న్ లో ఇరు కుటుంబీకుల మ‌ధ్య పెళ్లితో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే.

అయితే రాజ్ నిడిమోరు అంద‌రికీ ఓ కూల్ అండ్ కామ్ డైరెక్ట‌ర్ గా మాత్ర‌మే తెలుసు. సినిమా స్టోరీల విష‌యంలో ఎంతో షార్ప్ గా ఉండే రాజ్, స‌మంత‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత అత‌నిపై అటెన్ష‌న్ పెరిగింది. అందులో భాగంగానే ఆయ‌న గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం బ‌య‌ట‌పడింది. అదేంటంటే రాజ్ నిడిమోరు డైరెక్ష‌న్ మాత్ర‌మే కాదు, పాట‌లు కూడా పాడ‌గ‌ల‌రు అని.

మ‌హాగ‌ణ‌ప‌తి పాట‌ను ఆల‌పించిన స‌మంత భ‌ర్త‌

పాట‌లు పాడ‌ట‌మంటే ఏదో బాత్‌రూమ్ సింగింగ్ కాదు, చాలా గొప్ప‌గా ఆల్మోస్ట్ ప్రొఫెష‌న‌ల్ స్థాయిలో రాజ్ పాడ‌గ‌ల‌ర‌ని రీసెంట్ గా బ‌య‌టికొచ్చిన ఓ వీడియో చూస్తే అంద‌రికీ క్లారిటీ వ‌స్తుంది. తాజాగా రాజ్ నిడిమోరు చాలా సింపుల్ డ్రెస్ లో నేల‌పై కూర్చుని, మ‌హా గ‌ణ‌పతి సాంగ్ ను పాడిన వైనం, దాన్ని త‌న కుటుంబీకులు ఆల‌కిస్తున్న తీరు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

స‌మంత‌ను కూడా ఈ వాయిస్ తోనే ప‌డేశాడా?

ఇండ‌స్ట్రీలో ఎంతో ఫేమ‌స్ అయిన సింగ‌ర్ శోభ కు రాజ్ కుటుంబ స‌భ్యుడే. అలాంటి ఆమె స‌మ‌క్షంలోనే రాజ్ ఇప్పుడీ పాట‌ను పాడ‌టం అంద‌రినీ ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు రాజ్ కు ఇంత గొప్ప వాయిస్ ఉంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌ద‌ని, ఈ వాయిస్ తోనే స‌మంత‌ను కూడా ప‌డేసి ఉంటారేమో అని స‌ర‌దాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక కెరీర్ విష‌యానికొస్తే రీసెంట్ గా ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్3 స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ ను ముంబై లో చేసుకున్న రాజ్ అండే డీకే, ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్4 మ‌రింత భారీగా ఉండ‌నుంద‌ని హింట్ ఇచ్చారు.