Begin typing your search above and press return to search.

ప్రతి ప్రాజెక్టులో తెలుగు టచ్.. కారణం ఇదేనట!

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన రాజ్ నిడిమోరు, ప్రస్తుతం భారతీయ వినోద రంగంలో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ దర్శక రచయితలలో ఒకరిగా గుర్తింపు పొందారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   17 Jun 2026 1:15 PM IST
ప్రతి ప్రాజెక్టులో తెలుగు టచ్.. కారణం ఇదేనట!
X

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన రాజ్ నిడిమోరు, ప్రస్తుతం భారతీయ వినోద రంగంలో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ దర్శక రచయితలలో ఒకరిగా గుర్తింపు పొందారు. తన స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి బాలీవుడ్‌లో పలు విజయవంతమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందించిన ఆయన, జాతీయ స్థాయిలో పేరు సంపాదించినప్పటికీ తన తెలుగు మూలాలను మాత్రం ఎప్పుడూ మరిచిపోలేదని మరోసారి స్పష్టం చేశారు.

త‌న భార్య స‌మంత హీరోయిన్ గా, రాజ్ క‌థ అందించిన మా ఇంటి బంగారం సినిమా ప్ర‌మోష‌న్స్ లో రాజ్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అందులో భాగంగా తమ ప్రాజెక్టుల్లో తరచూ కనిపించే తెలుగు అంశాల వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానంతోనే కొన్ని ప్రాజెక్టుల్లో ఆయన పాటలు, రిఫరెన్స్‌లను ఉపయోగించామని చెప్పారు. గన్స్ అండ్ గులాబ్స్, గో గోవా గాన్ వంటి ప్రాజెక్టుల్లో చిరంజీవి ప్రస్తావనలు రావడం యాదృచ్ఛికం కాదని, అది తమకు ఉన్న అభిమానానికి ప్రతిబింబమని వివరించారు.

అయితే రాజ్- డీకే ఆలోచన కేవలం తెలుగు అంశాలను చేర్చడానికే పరిమితం కాలేదు. భిన్న సంస్కృతులు, భాషలతో కూడిన దేశంలో కథలు కూడా అదే వైవిధ్యాన్ని ప్రతిబింబించాలని తాము నమ్ముతామ‌ని, ఈ కారణంగానే తమ ప్రాజెక్టుల్లో పాత్రలు కేవలం హిందీలోనే మాట్లాడాలనే పరిమితిని తొలగించామని రాజ్ వెల్లడించారు. ఒక తమిళ వ్యక్తి తమిళంలో, ఒక తెలుగు వ్యక్తి తెలుగులో, ఒక మలయాళీ మలయాళంలో మాట్లాడితేనే ఆ పాత్ర సహజంగా కనిపిస్తుంద‌నే భావనతోనే తాము ఇప్ప‌టికీ ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. ఈ విధానం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నటులను ఎంపిక చేసుకునే అవకాశం మరింత విస్తరించిందని పేర్కొన్నారు.

రాజ్ కామెంట్స్ విన్న త‌ర్వాత రాజ్& డీకే స‌క్సెస్ కు ఇదే ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి. భాషను అడ్డంకిగా కాకుండా, కథనానికి బలంగా మార్చడం ద్వారా వారు భారతీయ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. బాలీవుడ్‌లో అగ్రస్థానానికి చేరుకున్నప్పటికీ, తన మూలాలను గౌరవిస్తూ భారతదేశ భాషా వైవిధ్యాన్ని తెరపై ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్న రాజ్ నిడిమోరు ప్రయాణం, ప్రాంతీయ గుర్తింపును జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనుకునే కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.రాజ్ కామెంట్స్ విన్న త‌ర్వాత రాజ్& డీకే స‌క్సెస్ కు ఇదే ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి. భాషను అడ్డంకిగా కాకుండా, కథనానికి బలంగా మార్చడం ద్వారా వారు భారతీయ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. బాలీవుడ్‌లో అగ్రస్థానానికి చేరుకున్నప్పటికీ, తన మూలాలను గౌరవిస్తూ భారతదేశ భాషా వైవిధ్యాన్ని తెరపై ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్న రాజ్ నిడిమోరు ప్రయాణం, ప్రాంతీయ గుర్తింపును జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనుకునే కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.