Begin typing your search above and press return to search.

అతడికి కిడ్నీ ఇస్తానన్న హీరోయిన్ భర్త.. ఆమె ఏం చేశారంటే?

ఈ మధ్యకాలంలో చాలామంది భక్తి మార్గాన్ని ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు మనశ్శాంతి కోసం దేవాలయాలను సందర్శిస్తూ.. తమకు తోచిన విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు.

By:  Madhu Reddy   |   16 Aug 2025 8:00 AM IST
అతడికి కిడ్నీ ఇస్తానన్న హీరోయిన్ భర్త.. ఆమె ఏం చేశారంటే?
X

ఈ మధ్యకాలంలో చాలామంది భక్తి మార్గాన్ని ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు మనశ్శాంతి కోసం దేవాలయాలను సందర్శిస్తూ.. తమకు తోచిన విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. లేదా ఏదైనా మంచి కార్యక్రమాలను చేపట్టి.. ప్రశాంతత పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ భర్త మాత్రం ఒక స్వామీజీకి ఏకంగా తన కిడ్నీని దానం చేస్తానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ విషయం తెలియడంతో ఆమె ఏం చేశారు అనే విషయం మరో ఆసక్తికర అంశంగా మారింది అని చెప్పవచ్చు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతటా ఈయనకు ఊహించని పాపులారిటీ ఉంది. ఈయన దగ్గరకు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు నిత్యం వస్తూ ఉంటారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులను మొదలుకొని శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతుల వరకు ఇలా చాలామంది ఈ స్వామీజీని సందర్శిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి.. తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి మధురాలోని స్వామీజీ ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు. ముఖ్యంగా రూ.60 కోట్ల స్కామ్ లో చిక్కుకున్న తర్వాత ఇలా సడన్ గా స్వామీజీ ఆశీస్సులు తీసుకుంది. ఈ జంటకి స్వామీజీ కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చారట.

స్వామీజీ విషయానికి వస్తే గత కొంతకాలంగా ఈయన రెండు కిడ్నీలు చెడిపోయాయి. గత పదేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. తనకు మరణ భయం లేదు అని, శిల్ప దంపతులతో చెప్పుకొచ్చారట. ఇది విన్న శిల్ప భర్త రాజ్ కుంద్రా స్వామీజీతో మాట్లాడుతూ.. "గత రెండు సంవత్సరాలుగా నేను మీ ప్రవచనాలు వింటూనే.. మిమ్మల్ని అనుసరిస్తున్నాను. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటే నేను ఎటువంటి సందేహం లేకుండా ఒక మాట మీతో చెప్పగలను. మీకు అభ్యంతరం లేదు అంటే ఒక కిడ్నీ ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధమే.. నేను మీకు చేయగలిగిన సహాయం కూడా ఇదొక్కటే" అంటూ స్వామీజీతో రాజ్ కుంద్రా చెప్పారు.

ఈ విషయం విన్న హీరోయిన్ శిల్పా శెట్టి మాత్రం ఆశ్చర్యపోయింది. చేసేదేమీ లేక తన భర్త చెప్పిన మాటలను వింటూ అలా ఉండిపోయింది. కానీ స్వామీజీ మాత్రం రాజ్ కుంద్రా మాటలను తిరస్కరించాడు. "నీ మాటలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. మనకు పిలుపు వచ్చేవరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లలేము కదా.. అలాగే దేవుడు పిలిచినప్పుడు ప్రతి ఒక్కరు వెళ్లాల్సిందే. నేను కూడా అంతే. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను" అంటూ తెలిపారు. మొత్తానికైతే ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా రాజ్ కుంద్రా కిడ్నీ ఇస్తానని చెప్పడం సంచలనంగా మారింది.