సంచలన ప్రాంచైజీ నుంచి పార్ట్ -3!
అప్పటి నుంచి 'రైడ్ 3' ఎప్పుడంటూ సోషల్ మీడయా వేదికగా అభిమానులు అడుగుతూనే ఉన్నారు. కానీ అప్పుడు మేకర్స్ ఎలాంటి బధులివ్వలేదు.
By: Srikanth Kontham | 21 Nov 2025 10:46 AM ISTబాలీవుడ్ లో 'రైడ్' ప్రాంచైజీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో మొదలైన ప్రాంచైజీ కమర్శియల్ గా కలిసొచ్చిన ప్రాజెక్ట్. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన రెండు భాగాలు అనూహ్య విజయాన్ని సాధించాయి. క్రైమ్ థ్రిల్లర్ నైపథ్యంలో తెరకెక్కిన రెండు భాగాలు ప్రేక్షకులను ఎంతగానో ఎంగేజ్ చేసాయి. అజయ్ దేవగణ్ సెటిల్డ్ పెర్పార్మెన్స్.. రాజ్ కుమార్ గుప్తా మేకింగ్ సినిమాను నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లాయి. 'రైడ్ 2' కూడా ఇదే ఏడాది మేలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
స్క్రిప్ట్ తోనే సర్ ప్రైజ్:
అప్పటి నుంచి 'రైడ్ 3' ఎప్పుడంటూ సోషల్ మీడయా వేదికగా అభిమానులు అడుగుతూనే ఉన్నారు. కానీ అప్పుడు మేకర్స్ ఎలాంటి బధులివ్వలేదు. ఇప్పుడు ఏకంగా స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి సర్ ప్రైజ్ చేసారు. పార్ట్ 3ని కూడా ఎలాంటి మార్పులు లేకుండా మొదలు పెడుతున్నారు. చాలా వరకూ యధావిధిగా పాత టీమ్ తోనే ముందుకెళ్తున్నారు. హీరోగా అజయ్ దేవగణ్..డైరెక్టర్ గా రాజ్ కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. బలమైన కథ, కథనాలతో రాజ్ కుమార్ రెడీ అవుతున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
రెండు భాగాల్లో వాళ్లిద్దరు!
అజయ్ దేవగణ్ ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలోనే కనిపించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అయితే ఇందులో హీరోయిన్ గా ఎవరు ఎంపిక అవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. 'రైడ్' మొదటి భాగంలో అజయ్ కు జోడీగా ఇలియానా నటించింది. ఆ కాంబినేషన్ తెరపై ఎంతో బ్యూటీఫుల్ గా హైలైట్ అయింది. అటుపై రెండవ భాగంలో వాణీ కపూర్ నటించింది. ఈ కలయిక తిరుగు లేదు. ఈ నేపథ్యంలో పార్ట్ లో 3 లో భాగమయ్యే నాయికపై ఆసక్తి నెలకొంది. రితేష్ దేశ్ ముఖ్, సౌరభ్ శుక్లా, సానంద్ వర్మ లాంటి వాళ్లు ఈ ప్రాంచైజీలో కీలక పాత్రలు పోషించారు.
ఈసారి ఛాన్స్ ఎవరికి?
మరి మూడవ భాగంలో వాళ్లను భాగం చేస్తున్నారా? లేదా? అన్నది తెలియాలి. అలాగే రెండు భాగాలకు అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఈ నేపథ్యంలో మూడవ భాగానికి కూడా ఆయన్నే తీసుకునే అవకాశాలు కని పిస్తున్నాయి. ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. 'ధమాల్ -4', 'రేంజర్' లో నటిస్తున్నాడు. వీటిలో ధమాల్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మరో సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఈ రెండు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
