ప్రియురాలిని పెళ్లాడిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్
గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన ప్రియురాలు హరిణ్య రెడ్డిని హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నాడు.
By: Sivaji Kontham | 27 Nov 2025 2:21 PM ISTగాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన ప్రియురాలు హరిణ్య రెడ్డిని హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హైదరాబాద్ గచ్చిబౌళిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీరాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.
ఏపీ తేదేపా నేత, సుడా ఛైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హిరణ్య రెడ్డి. ప్రీవెడ్డింగ్ లో భాగంగా నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ప్రత్యక్షమవ్వడం బిగ్ సర్ ప్రైజ్. రాహుల్- హిరణ్య జంటతో చాహల్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత వివరాల్లోకి వెళితే... అతడు హైదరాబాద్‌లో పుట్టి పెరిగాడు. రాహుల్ గాయకుడిగా సుప్రసిద్ధుడు. బిగ్ బాస్- తెలుగు విజేతగా అతడి ఖ్యాతి మరింత విస్తరించింది. అతడికి సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. చాలా సినిమాలకు అతడు చార్ట్ బస్టర్ పాటలను ఆలపించాడు. అతడు పాడిన RRR పాట `నాటు నాటు`కి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఎం.ఎం.కీరవాణి ఈ పాటకు సంగీతం అందించగా, చంద్రబోస్ ఈ పాటను రాసారు. కీరవాణి, రాజమౌళి బృందాలతో కలిసి అతడు ఆస్కార్స్ ప్రచార వేదికలపైనా కనిపించాడు.
రాహుల్ తెలుగు చిత్రసీమలో సీనియర్ గాయకుడు. 2009లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. నాగ చైతన్య చిత్రం జోష్ కోసం `కాలేజ్ బులూగా` అనే పాటను పాడాడు. చాలా సినిమాలకు చార్ట్ బస్టర్ పాటలను పాడాడు. రంగ రంగ రంగస్థలనా, సింగరేణి ఉంది, ప్రేమ కథా చిత్రం, పెద్ద పులి వంటి చార్ట్‌బస్టర్ పాటలు అతడికి ఎక్కువగా గుర్తింపు తెచ్చాయి.
