Begin typing your search above and press return to search.

ఇకపై నైజాం, సీడెడ్ కాదు.. మరి అందరూ ఫాలో అవ్వాలంటే..

సాధారణంగా ప్రేక్షకులు సినిమా వసూళ్ల గురించి తెలుసుకునేది ఇలాంటి అనౌన్స్మెంట్లు ద్వారానే. అందులో కొత్త పేర్లు కనిపిస్తే క్రమంగా వాటి యూజ్ పెరుగుతుంది.

By:  M Prashanth   |   24 Oct 2026 12:28 PM IST
ఇకపై నైజాం, సీడెడ్ కాదు.. మరి అందరూ ఫాలో అవ్వాలంటే..
X

మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు నైజాం, సీడెడ్ అనే పదాలు తరచూ వినిపిస్తుంటాయి. ఏ సినిమా ఏ ప్రాంతంలో ఎంత వసూలు చేసింది, ఎక్కడ ఎక్కువ కలెక్షన్లు వచ్చాయనే చర్చల్లో తెలంగాణ ప్రాంతాన్ని నైజాం అని, రాయలసీమ ప్రాంతాన్ని సీడెడ్ అని పిలవడం కామన్ గా మారిపోయింది. అయితే, తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ మారుతున్నా.. ఆ వర్డ్స్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నాయి.

ఇప్పుడు వీటి ప్లేస్ లో మన ప్రాంతాల పేర్లను వాడాలనే డిబేట్ సోషల్ మీడియాలో మొదలైంది. రీసెంట్ గా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ చేసిన కామెంట్స్ తో ఆ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ ఛేంజ్ మార్పు నిజంగా రావాలంటే ఏం చేయాలి, ఆ వర్డ్స్ ఎందుకు కంటిన్యూ చేయకూడదనే విషయంపై అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు

నైజాం అనేది గతంలో హైదరాబాద్‌ ను పాలించిన నైజాం రాజుల పేరుతో లింక్ అయ్యి ఉంది. సీడెడ్ అనే వర్డ్ కూడా బ్రిటిష్ పాలన కాలంలో ప్రాంతాలకు సంబంధించిన హిస్టరీని గుర్తుచేస్తుంది. ఆ పేర్లకు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ఉన్నప్పటికీ, నేటి ప్రాంతాల గుర్తింపును రిఫ్లెక్ట్ చేసేలా పేర్లను వాడవచ్చనేది రాహుల్ సాంకృత్యాన్ అభిప్రాయం. అనంతపురంలో జరిగిన రణబాలి ఈవెంట్ లో ఆయన ఆ అంశాన్ని ప్రస్తావించారు.

నైజాం, సీడెడ్ అనే పదాల స్థానంలో తెలంగాణ, రాయలసీమ అనే పేర్లు వాడటం మొదలుపెడితే ఆ ఛేంజ్ ప్రేక్షకులకు కూడా త్వరగా అలవాటవుతుంది. అయితే, ఒకరిద్దరు కొత్త పేర్లు వాడినంత మాత్రాన ఆ పద్ధతి మారదు. సినిమా ఇండస్ట్రీలోని అన్ని వర్గాలు ఒకే నిర్ణయానికి రావాలి. ముందుగా మూవీ నిర్మాణ సంస్థలు తమ పోస్టర్లు, కలెక్షన్ల ప్రకటనల్లో తెలంగాణ, రాయలసీమ పేర్లను ఉపయోగించవచ్చు.

సాధారణంగా ప్రేక్షకులు సినిమా వసూళ్ల గురించి తెలుసుకునేది ఇలాంటి అనౌన్స్మెంట్లు ద్వారానే. అందులో కొత్త పేర్లు కనిపిస్తే క్రమంగా వాటి యూజ్ పెరుగుతుంది. అలాగే, బాక్సాఫీస్ లెక్కలు చెప్పే ట్రేడ్ పండితులు, సినిమా వార్తలు అందించే మీడియా సంస్థలు కూడా ఆ ఛేంజ్ కు సహకరించాలి. ఇప్పటివరకు వాడుతున్న పదాలకు బదులుగా కొత్త పేర్లను ఉపయోగిస్తే ప్రేక్షకులకు కూడా వాటిపై అవగాహన పెరుగుతుంది.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వంటి సంస్థలు కూడా ఆ విషయంపై డిస్కస్ చేసి అందరికీ ఉపయోగపడేలా ఒక సాధారణ పద్ధతిని తీసుకురావచ్చు. అయితే, ప్రాంతాల పేర్లు మార్చడం ఒక్కటే సరిపోదు. డిస్ట్రిబ్యూషన్ రైట్స్, కలెక్షన్ల లెక్కలు, బిజినెస్ అగ్రిమెంట్స్ లో కూడా అవే వర్డ్స్ ఉండేలా చూడాలి. అప్పుడే ఆ ఛేంజ్ కేవలం మాటలకే పరిమితం కాకుండా, సినిమా ట్రేడ్‌ లోనూ అమలవుతుంది.

ఇక టాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో, మన ప్రాంతాల పేర్లకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆలోచన చర్చకు రావడం మంచి విషయమే. రాహుల్ లేవనెత్తిన ఆ అంశంపై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది చూడాలి. అందరూ ఒకే నిర్ణయంతో ముందుకు వస్తే, ఫ్యూచర్ లో నైజాం, సీడెడ్ అనే పదాలకు బదులుగా తెలంగాణ, రాయలసీమ పేర్లు వినిపించే అవకాశం ఉంటుంది.