అదేం PR స్టంట్ కాదు.. చున్నీ వివాదంపై రాహుల్ క్లారిటీ
అయితే గర్ల్ ఫ్రెండ్ మూవీ స్క్రీనింగ్ అవుతున్న ఓ థియేటర్ కు రాహుల్ వెళ్లగా.. అక్కడ సినిమా కంప్లీట్ అయ్యాక ఓ యువతి డైరెక్టర్ ను కలిసింది.
By: M Prashanth | 15 Nov 2025 9:23 AM ISTటాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇటీవల రొమాంటిక్ డ్రామా ది గర్ల్ ఫ్రెండ్ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాతో నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నారు. రిలీజైన అన్ని సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకున్నారని చెప్పాలి.
అయితే గర్ల్ ఫ్రెండ్ మూవీ స్క్రీనింగ్ అవుతున్న ఓ థియేటర్ కు రాహుల్ వెళ్లగా.. అక్కడ సినిమా కంప్లీట్ అయ్యాక ఓ యువతి డైరెక్టర్ ను కలిసింది. అప్పుడు దుప్పటా తీసి విసిరేసి చాలా ధైర్యంగా ఉన్నట్లు చెప్పింది. దీంతో ఆమెను ప్రశంసించి రాహుల్ హగ్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది.
దీంతో అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అయ్యారు. ఇదేనా ఉమెన్ ఎంపవర్ మెంటా? అని కొందరు.. పీఆర్ స్టంట్ అని మరికొందరు కామెంట్లు చేశారు. ఇంకొందరు ట్రోల్స్ చేశారు. రీసెంట్ గా ఆ విషయంపై సక్సెస్ మీట్ లో నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ట్రోల్స్ ఎక్కువవడంతో రాహుల్ రవీంద్రన్ స్పందించి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
రీసెంట్ గా ఓ నెటిజన్.. చున్నీ తీసేసిన అమ్మాయికి సక్సెస్ మీట్ కు పిలిచారా? లేకుంటే డబ్బులు ఇచ్చి చేయిపించారా? అంటూ పోస్ట్ పెట్టగా.. రాహుల్ అసహనం వ్యక్తం చేశారు. అదంతా అనుకోకుండా జరిగిందని తెలిపారు. ఆ అమ్మాయిపై మరింత నెగిటివిటీ రాకూడదని నేను దీనిపై స్పందించాలని అనుకోలేదని తెలిపారు. కానీ ట్రోల్స్ మరింత దారుణంగా ఉన్నాయని, అందుకే రెస్పాండ్ అవుతున్నట్లు చెప్పారు.
తాము ఆ థియేటర్ కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు రెండు వేర్వేరు థియేటర్ల మధ్య నిర్ణయం తీసుకోవడానికి ట్రై చేశామని, అక్కడికి వెళ్తామని స్పష్టత లేదని తెలిపారు. కాబట్టి అది ఎలాంటి పీఆర్ స్టంట్ కాదని స్పష్టత ఇచ్చారు. సినిమా చూసి చున్నీలు తీసిపారేయమని తాము చెప్పడం లేదని, అది వాళ్ల వ్యక్తిగత ఇష్టమని రాహుల్ అన్నారు. ఒక అమ్మాయి దుపట్టా తీసేస్తే సంస్కృతి దెబ్బ తీసినట్లుగా మాట్లాడుతున్నారని చెప్పారు.
కానీ ప్రతి వారం యాక్షన్ సీన్ కు ముందు మగాళ్లు తమ షర్ట్ లు చింపుకున్నప్పుడు ఎందుకు ఎవరూ స్పందించడం లేదని క్వశ్చన్ చేశారు. సెలబ్రేట్ చేసుకునేటప్పుడు చాలా షర్ట్ లు తీసి డ్యాన్స్ చేసినా ఎవరూ పట్టించుకోరని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంస్కృతి అనే భారం మహిళలకు ఎందుకని అన్నారు. సంస్కృతికి అంత ప్రాధాన్యత ఇస్తే, వారిలో చాలా మంది ఇంగ్లీష్ లో ఎందుకు ట్వీట్ చేస్తున్నారని అడగ్గా.. ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
