Begin typing your search above and press return to search.

హార్ట్ మైండ్.. సక్సెస్ మంత్ర అదే!

రాహుల్ రవీంద్రన్ రష్మిక గురించి మాట్లాడుతూ.. "రష్మిక పాత్రల గురించి తప్ప తన పాత్రకి ఎంత రెమ్యూనరేషన్ అనే విషయాన్ని అస్సలు పరిగణలోకి తీసుకోదు.

By:  Madhu Reddy   |   3 Nov 2025 4:00 PM IST
హార్ట్ మైండ్.. సక్సెస్ మంత్ర అదే!
X

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న తాజా మూవీ ది గర్ల్ ఫ్రెండ్.. మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించి నెల రోజుల ముందు నుండే ప్రమోషన్స్ మొదలెట్టారు చిత్ర యూనిట్. ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుండి మొదలు వరస ప్రమోషన్స్ చేస్తూ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ రవీంద్రన్ - రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యంగా రాహుల్ రష్మిక గురించి మాట్లాడుతూ ఆమె సక్సెస్ మంత్ర ఇదే అంటూ తెలిపారు.

రాహుల్ రవీంద్రన్ రష్మిక గురించి మాట్లాడుతూ.. "రష్మిక పాత్రల గురించి తప్ప తన పాత్రకి ఎంత రెమ్యూనరేషన్ అనే విషయాన్ని అస్సలు పరిగణలోకి తీసుకోదు. ఒక పాత్ర ఇస్తే అందులో ఎలా నటించాలి అనేది మాత్రమే తన దృష్టిలో ఉంటుంది.. రష్మిక ఎప్పుడు కూడా తన గుడ్ హార్ట్ తోనే ఆలోచిస్తుంది.. సినిమాకి ఎంత బడ్జెట్ పెడుతున్నారు? రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారు? అనేది మాత్రం ఆలోచించదు. తన పాత్రకి ప్రాధాన్యత ఉండాలి అనేది మాత్రమే రష్మిక మొదటి లక్ష్యం.. ఇక రష్మిక కూడా నాలాగే ఆలోచిస్తుంది.ఆమె చాలా గుడ్ హార్ట్ మైండెడ్.. ఏ సినిమా విషయంలో అయినా సరే రెమ్యూనరేషన్ కాకుండా మంచి మనసుతో ఆలోచించి మంచి మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటుంది కాబట్టే ఇండస్ట్రీలో ఇంత సూపర్ సక్సెస్ అయింది.. ఆమెకు ఎలాంటి పాత్ర ఇచ్చిన సరే ఆ పాత్రకు 100% న్యాయం చేస్తుంది.తన పాత్రకి ప్రాణం పోసే విషయంలో రష్మిక ముందుంటుంది.

అందుకే ఇన్ని సినిమాల్లో సక్సెస్ అవుతుంది. కొన్ని సినిమాల్లో హీరోకి మాత్రమే పేరు వస్తుంది.కానీ రష్మిక హీరోయిన్ గా చేసే ఏ సినిమాలో అయినా సరే హీరోతో పాటు రష్మిక కూడా తన యాక్టింగ్ తో పేరు తెచ్చుకుంటుంది. ఇక రష్మిక సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన యానిమల్ మూవీలో గీతాంజలి పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాలోని గీతాంజలి పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచింది.గీతాంజలి అనే పాత్ర ఒక అద్భుతమైన పాత్ర.. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది అస్సలు పట్టించుకోలేదు.. తనకు ఇచ్చిన పాత్రని 100% న్యాయం చేసి చూపించింది.. ఇక ఇంతకుముందు వచ్చిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే హీరోయిన్ల కంటే యానిమల్ మూవీలోని గీతాంజలి పాత్రకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చారు డైరెక్టర్. కానీ ఎందుకో కొంత మంది సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ ని విమర్శించారు. ఈ సినిమాలో అమ్మాయిల్ని తక్కువ చేసి చూపించారు అనే కోణంలో ఆయన్ని విమర్శలు చేశారు. కానీ యానిమల్ మూవీ లో గీతాంజలి పాత్ర ఒక అద్భుతం..

రష్మిక సినిమా కోసం చాలా సహజంగా సిన్సియారిటీతోపాటు ఏ పాత్ర ఇచ్చిన సరే చాలా ఎమోషన్ గా కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ రష్మిక నటనకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇక రష్మికతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది" అంటూ రాహుల్ రవీంద్రన్ రష్మిక మందన్నా పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా కోసం రష్మికకు రెట్టింపు రెమ్యూనరేషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదట ఈ సినిమా స్టోరీ నరేషన్ చేయడంతోనే రష్మిక ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వకుండానే ప్రాజెక్టు చేద్దాం అని సినిమాలో నటించిందట. అందుకే కృతజ్ఞతతో ఇప్పుడు డబుల్ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు రీసెంట్గా ఈ మూవీ నిర్మాత ధీరజ్ మొగిలినేని ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ చేసిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న తెలుగు, హిందీ లో, నవంబర్ 14న కన్నడ,మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్నాతోపాటు దీక్షిత్ శెట్టి, అను ఇమ్మానుయేల్ లు కూడా నటిస్తున్నారు.