'ఫౌజీ' సెట్‌లో ఫన్నీ సీన్.. ప్రభాస్ షాక్!
ఆ మేకప్‌లో ఉన్న రాహుల్‌ను చూసి ప్రభాస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట, "రాహుల్ మీరా? అప్పుడు చాలా క్యూట్‌గా ఉండేవారు.. ఇప్పుడు ఇలా ఉన్నారేంటి?" అంటూ ఆశ్చర్యపోయాడట.
By: M Prashanth | 28 Oct 2025 9:55 PM ISTయాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, 'చి.ల.సౌ'తో నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌గా మారిన రాహుల్ రవీంద్రన్, ఇప్పుడు మళ్లీ యాక్టింగ్‌లో ఫుల్ బిజీ అయ్యాడు. ఒకవైపు తన డైరెక్షన్‌లో రష్మికతో 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాను నవంబర్ 7న రిలీజ్‌కు రెడీ చేస్తూనే, మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి 'ఫౌజీ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రేజీ కాంబో గురించి రాహుల్ రీసెంట్‌గా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాడు.
హను రాఘవపూడి డైరెక్షన్‌లో వస్తున్న 'ఫౌజీ' షూటింగ్‌లో రాహుల్ ఇప్పటికే మూడు రోజులు పాల్గొన్నాడు. అందులో ఒక రోజు ప్రభాస్‌తో కాంబినేషన్ సీన్ ఉందట. అయితే, ఈ సినిమా కోసం రాహుల్ క్యారెక్టర్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, తెల్ల జుట్టు, తెల్ల గడ్డంతో కనిపించాల్సి వచ్చిందని చెప్పాడు.షూటింగ్ స్పాట్‌లో ప్రభాస్‌ను కలవగానే రాహుల్ 'హాయ్' చెప్పాడట.
ప్రభాస్ కూడా తిరిగి 'హాయ్' చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సీన్ పూర్తిచేశారు. అంతా అయిపోయాక, ప్రభాస్ డైరెక్టర్ హను దగ్గరికి వెళ్లి, "ఆయన్ను ఎక్కడో చూసినట్టుంది కానీ, గుర్తుపట్టలేకపోతున్నా" అని అడిగాడట. అప్పుడు హను నవ్వుతూ, ప్రభాస్‌ను రాహుల్ దగ్గరకు తీసుకొచ్చి, "ఇతను నా ఫస్ట్ సినిమా 'అందాల రాక్షసి' హీరో రాహుల్ రవీంద్రన్" అని పరిచయం చేశాడట.
ఆ మేకప్‌లో ఉన్న రాహుల్‌ను చూసి ప్రభాస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట, "రాహుల్ మీరా? అప్పుడు చాలా క్యూట్‌గా ఉండేవారు.. ఇప్పుడు ఇలా ఉన్నారేంటి?" అంటూ ఆశ్చర్యపోయాడట. వెంటనే తేరుకుని, "గుర్తుపట్టనందుకు సారీ, ఏమీ అనుకోకండి" అని ప్రభాస్ చాలా స్వీట్‌గా చెప్పాడని రాహుల్ అన్నాడు.
ఈ ఇన్సిడెంట్ చూస్తే, క్యారెక్టర్ కోసం రాహుల్ ఎంతలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడో, ఆ మేకప్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో అర్థమవుతోంది. ఒకవైపు 'ది గర్ల్‌ఫ్రెండ్' లాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీని డైరెక్ట్ చేస్తూ, మరోవైపు 'ఫౌజీ'లో ఇంత డిఫరెంట్ లుక్‌తో యాక్ట్ చేస్తూ రాహుల్ తన మల్టీ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ కూడా గుర్తుపట్టలేనంతగా మేకోవర్ అవ్వడం అనేది యాక్టర్‌గా రాహుల్ డెడికేషన్‌ను చూపిస్తోంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
