కాపీ కాదు రీమేక్.. అసలు సీక్రెట్ చెప్పిన దర్శకుడు
కానీ ఆ తర్వాత మన్మధుడు సీక్వెల్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిర రాహుల్ రవీంద్రన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
By: Sivaji Kontham | 2 Nov 2025 3:00 AM ISTకింగ్ నాగార్జున నటించిన మన్మధుడు టాలీవుడ్ క్లాసిక్ చిత్రాలలో ఒకటి. ఈ సినిమాకి కె.విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత మన్మధుడు సీక్వెల్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిర రాహుల్ రవీంద్రన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అతడు కాపీ క్యాట్ సినిమా తీసాడంటూ విమర్శించారు. అయితే అప్పట్లో మన్మధుడు 2 తెరకెక్కించడానికి ఫలానా హాలీవుడ్ సినిమా స్ఫూర్తి అని ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు `ది గర్ల్‌ఫ్రెండ్` రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాహుల్ రవీంద్రన్ మన్మధుడు 2 సీక్రెట్ గురించి రివీల్ చేసాడు. ఈ చిత్రాన్ని కాపీ అని విమర్శించారు.. కానీ తాము ఎలాంటి కాపీ చేయలేదని అన్నాడు. దీనిని 2006 ఫ్రెంచ్ సినిమా `ఐ డూ`ని అధికారికంగా రీమేక్ చేసాం. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద హక్కులు ఉన్నాయి అని రాహుల్ చెప్పాడు.
మన్మధుడు 2 బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత తనపై వచ్చిన విమర్శలు చాలా బాధించాయని కూడా రాహుల్ రవీంద్రన్ అంగీకరించాడు. అయితే పరాజయాలు నేర్పిస్తాయి. విజయం కంటే వైఫల్యాల నుంచే ఎక్కువ నేర్చుకునే వీలుందని రాహుల్ రవీంద్రన్ అన్నారు. తనపై విమర్శలు ఎదురైనా వాటిని తట్టుకునే శక్తి రాహుల్ కి ఉంది. అతడు ప్రశాంతంగా అన్నిటినీ పరిశీలిస్తాడు. అనవసరంగా నోరు జారడు. ఇది అతడి వ్యక్తిత్వం.
తాజా ప్రాజెక్ట్ `ది గర్ల్ ఫ్రెండ్` రిలీజ్ పైనే ప్రస్తుతం దృష్టి సారించానని రాహుల్ అన్నాడు. నవంబర్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. పాటలు, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
