మూడేళ్ల క్రితం నాటి చిత్రానికి 2026 లో మోక్షం!
మూడేళ్ల క్రితమే మొదలైనా అనివార్య కారణాలతో షూటింగ్ పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో 2026 లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
By: Srikanth Kontham | 7 Dec 2025 5:00 PM ISTఏ. ఆర్. రెహమాన్ కంపోజ్ చేసిన ఎన్నో పాటలకు ప్రభుదేవా స్టెప్స్ కంపోజ్ చేసారు. కొన్ని సినిమాల్లో తానే హీరోగానూ అలరించాడు. రెహమాన్ బీట్ పట్టిన సిసలైన కంపోజర్ గా ప్రభుదేవాకు పేరుంది. తాజాగా మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ చేతులు కలిపారు. రెహమాన్-ప్రభుదేవా కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. అంతే కాదు ఈ సినిమాలో ఐదు పాటలకు రెహమాన్ సంగీతం అందించడమే కాదు..వాటిని స్వయంగా ఆయనే పాడి రికార్డు సృష్టించారు. ఒకే సినిమా కోసం రెహమాన్ ఇన్ని పాటలు ఎప్పుడు తానై పాడలేదు. దీంతో రెహమాన్ కెరీర్ లోనూ ఇదో రికార్డు గా మారింది.
రెహమాన్ పేరిట ఇదో రికార్డు:
ఆ సినిమా ఏంటి? అంటే `మూన్ వాక్`. అయితే ఈ సినిమా ప్రారంభమైంది 2025 లో కాదు. మూడేళ్ల క్రితమే మొదలైంది. `బిహైండ్ ఉడ్స్` సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ మనోజ్ నిర్మలా శ్రీధర్ స్వీయా దర్శకత్వంలో నిర్మి స్తున్నారు. రెహమాన్-ప్రభుదేవాలను చూసి ఈ సాహసానికి పూనుకున్నారు. `జెంటిల్మెన్` , `కాదలన్` లాంటి అనుభవాలను మళ్లీ ప్రేక్షకులకు అందించాలనే చేసిన ఓ ప్రయత్నమే `మూన్ వాక్`. సంగీతం..డాన్స్ నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ఈ సినిమా కోసం ప్రభుదేవా కూడా చాలా కష్టపడ్డారు. ప్రతీ పాటకు దేవా రెండు వారాల పాటు, రిహార్సల్స్ చేసారు.
ఎట్టకేలకు 2026 లో రిలీజ్:
మూడేళ్ల క్రితమే మొదలైనా అనివార్య కారణాలతో షూటింగ్ పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో 2026 లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే రెహమాన్-ప్రభు దేవా లాంటి దిగ్గజాలు చేస్తోన్న ఏ చిత్రం ఇంత వరకూ డిలే క కాలేదు. వారు పని చేసిన అన్ని చిత్రాలు అనుకున్న సమయంలోనే రిలీజ్ చేసారు. `మూన్ వాక్` మాత్రమే మూడేళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న చిత్రం. `మూన్ వాక్` టైటిల్ తో ఇదే ఏడాది మలయాళంలో ఓ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఆ సినిమాకు ఈ సినిమా ఎలాంటి రీమేక్ కాదు. రెండు వేర్వేరు కథలుగా తెలుస్తోంది.
ఆ సినిమాతో సంబంధం లేదు:
మలయాళం రీమేక్ కథ ఇలా ఉంటుంది. 1980లలో బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అది. ఒకే గ్రామానికి చెందిన ఓ నలుగరు కుర్రాళ్లు ఒకే కాలేజ్ లో చదుతుంటారు. కానీ వీరికి చదువుపై కంటే కూడా బయట తిరగడం పైనే ఫోకస్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ ఊళ్లో జరిగిన ఒక కార్యక్రమంలో సిటీ నుంచి వచ్చిన కొందరు కుర్రాళ్లు డాన్స్ చేస్తారు. యూత్ లో డాన్స్ కి ఉన్న క్రేజ్ చూసిన తరువాత, తాము కూడా నేర్చుకోవాలని వీళ్లంతా అనుకుంటారు. వీరందరిపై మైఖేల్ జాక్సన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జాక్సన్ `మూన్ వాక్` కి విపరీతమైన క్రేజ్ ఉండటంతో తమ టీమ్ కి `మూన్ వాకర్స్` అనే పేరు పెట్టుకుంటారు.
