Begin typing your search above and press return to search.

శ్రీకాకుళం యాస‌లో రెహ‌మాన్ మాస్ బీట్!

రెహ‌మాన్ బిజీ షెడ్యూల్ లో క‌మిట్ అవ్వ‌డం అన్న‌ది చిన్న విష‌యం కాదు. రెహ‌మాన్ సంగీతం పై బుచ్చిబాబు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు.

By:  Srikanth Kontham   |   13 Aug 2025 4:00 AM IST
శ్రీకాకుళం యాస‌లో రెహ‌మాన్ మాస్ బీట్!
X

`పెద్ది` చిత్రానికి రెహ‌మాన్ సంగీతం అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత రెహ‌మాన్ తెలుగు సినిమాకు ప‌ని చేస్తున్నారు. రెహ‌మాన్ మాత్ర‌మే త‌న సినిమాకు న్యాయం చేస్తాడ‌ని భావించి ద‌ర్శకుడు బుచ్చిబాబు ఏరికోరి మ‌రీ తీసుకొచ్చాడు. ఇప్ప‌టికే మంచి టూన్స్ కూడా రెహ‌మాన్ అందించిన‌ట్లు బుచ్చి బాబు రివీల్ చేసాడు. బుచ్చిబాబు రెండ‌వ సినిమాకే మ్యూజిక్ లెజెండ్ ని తీసుకు రావ‌డం అన్న‌ది గొప్ప విష‌య‌మే. చాలా మంది ద‌ర్శ‌కులు చేయ‌లేని సాహ‌సం బుచ్చిబాబు చేసాడు.

రెహ‌మాన్ కు క‌త్తి మీద సామే:

రెహ‌మాన్ బిజీ షెడ్యూల్ లో క‌మిట్ అవ్వ‌డం అన్న‌ది చిన్న విష‌యం కాదు. రెహ‌మాన్ సంగీతం పై బుచ్చిబాబు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఓ మాంచి మాస్ ఐటం సాంగ్ కూడా ఒక‌టుంది. అది శ్రీకాకుళం యాస్ లో జాన‌ప‌దాన్ని పోలి ఉంటుంద‌ని వినిపిస్తుంది. ఉత్త‌రాంద్రా బ్యాక్ డ్రాప్ స్టోరీ కావ‌డంతో? ఇలాంటి పాట డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈపాట‌కు రెహ‌మాన్ ఎంత వ‌ర‌కూ న్యాయం చేస్తారు? అన్న‌ది అంతే ముఖ్యం. రెహ‌మాన్ మాస్ పాట‌తో తెలుగు క‌నెక్ట్ అవ్వ‌డం అన్న‌ది క‌త్తీమీద సామే.

మెగా మాస్ కి క‌నెక్ట్ అవ్వాలి:

తెలుగు సినిమాల‌కు రెహ‌మాన్ సంగీతం అందించ‌డం అన్న‌ది కొత్త కాక‌పోయినా? ఇప్పుడాయ‌న మ్యూజిక్ వెస్ట్ర‌న్ ప్రామాణికంగా ఉంటుంది. కొంత కాలంగా ఆయ‌న సినిమా పాట‌లు కూడా తెలుగు ఆడియ‌న్స్ కు పెద్ద‌గా క‌నెక్ట్ అవ్వ‌డం లేదు. ఆయ‌న అప్ డేటెడ్ వెర్ష‌న్ కి క‌నెక్ట్ క‌ష్ట‌మ‌వుతుంది. ఓ సెక్ష‌న్ మ్యూజిక్ ప్రియు ల‌కు త‌ప్ప అంతా క‌నెక్ట్ అవ్వ‌లేక‌పోతున్నారు. అలాంటి రెహ‌మాన్ తో శ్రీకాకుళం యాస లో ఐటం సాంగ్ అంటే? చిన్న విష‌యం కాదు. పైగా ఆ పాట‌ను రెహ‌మాన్ మాస్ ఆడియ‌న్స్ కి కనెక్ట్ చేయాలి.

బాధ్య‌త బుచ్చిబాబు పైనే:

మెగా ఫ్యామిలీ హీరో సినిమా అంటే? మాస్ ఇమేజ్ పీక్స్ లో ఉంటుంది. `ఆట కావాలా పాట కావాలా`, `ర‌త్తాలు ఓసోసి ర‌త్తాలు`, `బంగారు కోడి పెట్ట` త‌ర‌హాలోనే అభిమానులు మాస్ బీట్ ని ఆశిస్తారు. ఈ విష‌యంలో రెహ‌మాన్ రిస్క్ తీసుకోవ‌డానికి ఛాన్స్ లేదు. క‌చ్చితంగా మాస్ కి క‌నెక్ట్ అయ్యే ఊర మాస్ బీట్ ఇవ్వాల్సిందే. మాస్ ప‌ల్స్ ప‌ట్టుకుని సాంగ్ చేయాల్సిందే. ఈ విష‌యంలో రెహమాన్ ని మోటివేట్ చేయాల్సిన పూర్తి బాధ్య‌త బుచ్చి బాబు పైనే ఉంది. మ‌రి ఆయ‌న్ని బుచ్చిబాబు ఎలా ట్యూన్ చేస్తాడో చూడాలి.