రెహమాన్‌ని కొట్టాలనుకున్న డైరెక్టర్
మణిరత్నం, ఆర్జీవీ లాంటి డ్యాషింగ్ డైరెక్టర్లతో ఆయన పని చేసారు. అయితే 90లలో ఆర్జీవీ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ `రంగీలా`కు రెహమాన్ అందించిన సంగీతం ఒక సెన్సేషన్.
By: Sivaji Kontham | 27 Nov 2025 8:00 PM ISTతనదైన సృజనాత్మకతతో దశాబ్ధాల పాటు పాటల పూదోటలో స్వరమాంత్రికుడిగా హృదయాలను గెలుచుకున్న ఏ.ఆర్.రెహమాన్ .. ఎందరో దిగ్గజ దర్శకులతో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. మణిరత్నం, ఆర్జీవీ లాంటి డ్యాషింగ్ డైరెక్టర్లతో ఆయన పని చేసారు. అయితే 90లలో ఆర్జీవీ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ `రంగీలా`కు రెహమాన్ అందించిన సంగీతం ఒక సెన్సేషన్.
ఈ సినిమాలో `యాయిరే యాయిరే` పాట ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది. ఊర్మిల అద్భుత డ్యాన్సులు, రెహమాన్ అసాధారణమైన బాణి సంగీతాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి. ఇక ఇదే సినిమా కోసం కంపోజ్ చేసిన `హై రామా` పాట రొమాంటిక్ గీతాలలో ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించింది. జాకీ- ఊర్మిల జంట నడుమ అద్భుతమైన రొమాన్స్ వర్కవుట్ అయింది. ఎడారిలో అద్భుతమైన సెటప్‌లో లీడ్ పెయిర్ నడుమ రొమాన్స్ ని ఆర్జీవీ చిత్రీకరించారు.
అయితే ఈ ట్యూన్ రెడీ చేయడానికి ఏఆర్. రెహమాన్ ఎంతగా ముప్పు తిప్పలు పెట్టారో తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఈ ట్యూన్ ని ఐదు రోజుల్లో రెడీ చేయాల్సి ఉండగా, ప్రతి రోజూ ఏదో ఒక షాక్ చెప్పారట రెహమాన్. పాట కోసం అప్పటికే గోవా వెళ్లారు. ఈరోజు బాణీ రెడీ కాలేదు .. రేపు సిద్ధమవుతుంది అని చెప్పేవాడట. రెండో రోజు మూడో రోజు ఏదో ఒక కొంటె షాకు చెప్పాడు. చివరికి ఐదో రోజు ``నేను చెన్నై వెళ్లి ట్యూన్ పంపుతాను`` అని చెప్పాడట. ఇకపై ఎప్పుడైనా హోటల్ రూమ్ ఇచ్చినప్పుడు అందులో టీవీ లేకుండా చూడాలని, ఒకవేళ టీవీ ఉంటే తాను ఎప్పుడూ టీవీ చూస్తూనే ఉంటానని రెహమాన్ అసలు విషయం చెప్పారట.
ఆ సమయంలో రెహమాన్ సమాధానం విన్న వెంటనే ఒక్కటి కొట్టాల (సరదాగా నవ్వేస్తూ చెప్పారు)ని అనుకున్నాడట ఆర్జీవీ. కానీ ఆ తర్వాత ట్యూన్ రెడీ కాగానే దానికి ఉప్పొంగిపోయారు ఆర్జీవీ. ఇది బాలీవుడ్‌లోని క్లాసిక్ పాటలలో ఒకటిగా నిలిచింది. రంగీలా చిత్రానికి 9 ఫిలింఫేర్ లు దక్కగా, రెహమాన్ కి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ దక్కింది. ఉత్తమ సహాయనటుడిగా జాకీ ష్రాఫ్ కి పురస్కారం దక్కింది. 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, 33 కోట్లు వసూలు చేసింది.
