రెహమాన్ కు సపోర్ట్ గా అతని పిల్లలు.. ఏం చేశారంటే?
ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు రీసెంట్ గా చేసిన కొన్ని కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 20 Jan 2026 6:13 PM ISTఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు రీసెంట్ గా చేసిన కొన్ని కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. మతపరమైన కారణాలతో తనకు బాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయని రెహమాన్ ఇన్‌డైరెక్ట్ గా కామెంట్స్ చేయగా ఈ కామెంట్స్ పై కొందరు నెటిజన్లు రెహమాన్ ను టార్గెట్ చేశారు.

క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేసిన రెహమాన్
రెహమాన్ కామెంట్స్ ను ఎంతో మంది ప్రముఖులు, సోషల్ మీడియా యూజర్లు వివాదాస్పదంగా అభివర్ణిస్తూ మతాన్ని ప్రస్తావించడం అవసరమా అని ఆయన్ని ప్రశ్నించారు. ఈ వివాదం బాగా ముదరడంతో రెహమాన్ స్వయంగా రియాక్ట్ అవుతూ తన కామెంట్స్ ను ఎవరో కావాలని తప్పుదోవ పట్టించారని క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
కళాకారులకు గౌరవం తగ్గిందనే బాధతో..
తానెప్పుడూ ఎవరినీ బాధపెట్టాలనుకోలేదని, ఇండియానే తనకు ఇల్లు, ఇక్కడే తాను మ్యూజిక్ నేర్చుకున్నానని, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు తనకు గురువులని, తానెప్పుడూ దేశాన్ని, ప్రజల్ని విమర్శించనని, ఇండియా తనకెప్పటికీ స్పూర్తి అని, కళాకారులకు, మ్యూజిక్ కు గౌరవం తగ్గిందనేదే తన ఉద్దేశమని, తన మాటలకు మతాన్ని ముడిపెట్టొద్దని వివాదానికి ముగింపు చెప్పే ప్రయత్నం చేశారు.
మోదీ ప్రశంసల వీడియోను పోస్ట్ చేసిన అమీన్
అయినా సరే రెహమాన్ పై విమర్శలు ఆగకపోవడంతో అతని కొడుకు అమీన్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. గతంలో ప్రధాని మోదీ, రెహమాన్ పై చేసిన ప్రశంసల వీడియోను అమీన్ షేర్ చేయగా, ఆ వీడియోలో రెహమాన్ మ్యూజిక్, రాజమౌళి సినిమాలు ఇండియన్ కల్చర్ ను ప్రతిబింబిస్తూ వరల్డ్ వైడ్ గా ఎన్నో కోట్ల మంది హృదయాలను గెలుచుకుంటున్నాయని మోదీ అన్నారు. తన తండ్రి గొప్పదనాన్ని అందరికీ గుర్తు చేస్తూ అమీన్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.
వివాదంపై రియాక్ట్ అయిన రెహమాన్ కూతుళ్లు
రెహమాన్ కూతుళ్లు కూడా ఈ వివాదంపై స్పందించారు. తన తండ్రికి మద్దతుగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ కైలాష్ మీనన్ ఓ పోస్ట్ చేశారు. రెహమాన్ తన మనసులోని మాటను చెప్పారని, అది ఆయన హక్కు అని, ఆయన అభిప్రాయంతో మీరు విభేదించినప్పటికీ అతని అనుభవాన్ని తప్పు బట్టే హక్కు ఎవరికీ లేదని, ప్రపంచం గర్వించదగ్గ కళాకారుడిని డిస్‌గ్రేస్ అని పిలవడం, ఆయన విశ్వాసాన్ని ప్రశించిడం విద్వేషమని రాసుకురాగా ఆ పోస్టుకు రెహమాన్ కూతుళ్లు రహీమా, ఖతీజా మద్దతిస్తూ రీపోస్ట్ చేశారు. రహీమా ఈ విషయంలో ఇంకాస్త ఘాటుగా రెస్పాండ్ అయి, జనాలకు పవిత్ర గ్రంథాలను చదివి క్రమశిక్షణ నేర్చుకోవడానికి టైముండదు కానీ ఎవరినైనా నిందించడానికి, అగౌరవ పరచడానికి మాత్రం ఎప్పుడూ టైముంటుందని మండిపడ్డారు.
