Begin typing your search above and press return to search.

50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ సింగర్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఇదే!

రఘు దీక్షిత్ వ్యక్తిగత విషయానికి వస్తే.. 2005లో డాన్సర్ మయూరి ఉపాధ్యాయాతో ఆయనకు వివాహం జరిగింది.

By:  Madhu Reddy   |   17 Oct 2025 1:00 AM IST
50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ సింగర్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఇదే!
X

సెలబ్రిటీస్ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతుంది అనడంలో సందేహం లేదు. పైగా ఆ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సరే.. ఈ క్రమంలోనే ఒక స్టార్ సింగర్ ఇప్పుడు 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధం అవుతుండడంతో అందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమవుతున్న ఆ స్టార్ సింగర్ ఎవరు? ఈయనను వివాహం చేసుకోవడానికి సిద్ధమైన ఆ అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? ఇద్దరి మధ్య వయసు తేడా ఎంత ? ఇలా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

ఆయన ఎవరో కాదు ప్రముఖ సింగర్ రఘు దీక్షిత్.. ఇప్పుడు 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. సింగర్, ఫ్లూటిస్ట్ గా పేరు సొంతం చేసుకున్న వారిజ శ్రీ వేణుగోపాల్ తో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈమె వయసు 34 సంవత్సరాలు. ఇక దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య దాదాపు 16 సంవత్సరాల తేడా ఉందని తెలుస్తోంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉండగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఇప్పుడు పెళ్లికి సిద్ధమైనట్టు సమాచారం. అందులో భాగంగానే ఈనెల ఆఖరున వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకోబోతున్నారట.

రఘు దీక్షిత్ వ్యక్తిగత విషయానికి వస్తే.. 2005లో డాన్సర్ మయూరి ఉపాధ్యాయాతో ఆయనకు వివాహం జరిగింది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఒంటరిగా ఉన్న ఈయన ఇటీవల వారిజా శ్రీ వేణుగోపాల్ తో ప్రేమలో పడి ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు.

రఘు దీక్షిత్ కెరియర్ విషయానికి వస్తే తెలుగులో.. సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలలో తన అద్భుతమైన గాత్రంతో పాటలను ఆలపించి ప్రేక్షకులను అలరించిన ఈయన.. తెలుగులోనే కాకుండా.. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల చిత్రాలలో కూడా పాటలు ఆలపించి.. పాన్ ఇండియా స్టార్ సింగర్ గా పేరు సొంతం చేసుకున్నారు

రఘు దీక్షిత్ వివాహం చేసుకోబోతున్న అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. వారిజా శ్రీ వేణుగోపాల్ బెంగళూరులో 1991 మార్చి 6న జన్మించారు. గ్రామీ అవార్డుకు నామినేట్ చేయబడిన భారతీయ గాయని, ఫ్లూటిస్ట్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు. 2024లో "ఎ రాక్ సమ్ హెయిర్" రచనకు జాకబ్ కొలియర్, అనౌష్క శంకర్ లతో కలిసి తన మొదటి గ్రామీ నామినేషన్ ను ఈమె అందుకున్నారు. అంతేకాదు చార్కా ఫోనిక్స్, స్నార్కీ పప్పీ వంటి బ్యాండ్లతో కలిసి పనిచేసే స్వతంత్ర కళాకారిణిగా పేరు తెచ్చుకున్న ఈమె "కర్ణాటిక్ స్కాట్ సింగింగ్" అనే కళారూపాన్ని కూడా సృష్టించింది.