Begin typing your search above and press return to search.

ఓ ఫెయిల్యూరే లారెన్స్‌కు వంద కోట్లు తెచ్చిపెట్టిందా?

లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ (డిజిటల్ + శాటిలైట్) ఇప్పటికే వంద కోట్లు దాటేశాయని సమాచారం.

By:  M Prashanth   |   6 Nov 2025 12:33 PM IST
ఓ ఫెయిల్యూరే లారెన్స్‌కు వంద కోట్లు తెచ్చిపెట్టిందా?
X

ఒక జానర్ ఔట్ డేట్ అయిపోయింది, ఒక డైరెక్టర్ ఫామ్‌లో లేడు, సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది.. ఇలాంటి మాటలన్నీ కాంచన 4 అనౌన్స్ చేసినప్పుడు గట్టిగానే వినిపించాయి. హార్రర్ కామెడీల ట్రెండ్ పోయిందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, రాఘవ లారెన్స్ మాత్రం తన బ్రాండ్ వాల్యూ ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే, కాంచన 4 బిజినెస్ డీల్స్ చూసి ఇండస్ట్రీ షాక్ అవుతోంది. ​

లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ (డిజిటల్ + శాటిలైట్) ఇప్పటికే వంద కోట్లు దాటేశాయని సమాచారం. కేవలం అన్ని భాషల డిజిటల్ రైట్స్ 50 కోట్లు పలకగా, అసలు సర్‌ప్రైజ్ హిందీ హక్కుల రూపంలో వచ్చింది. ఒక్క హిందీ రైట్స్ (థియేట్రికల్ + శాటిలైట్) ఏకంగా 50 కోట్లకు పైగా అమ్ముడవడం ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరుస్తోంది. ​

ఇంత భారీ రేటు హిందీలో ఎలా సాధ్యమైందంటే.. ఇక్కడే లారెన్స్ బ్రాండ్ మ్యాజిక్ ఉంది. కాంచన సిరీస్‌కు నార్త్ ఇండియాలో, ముఖ్యంగా శాటిలైట్, యూట్యూబ్‌లో సాలీడ్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్లకు లారెన్స్ మార్క్ హార్రర్, కామెడీ, సెంటిమెంట్ నచ్చేసింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కాంచనను లక్ష్మీ పేరుతో రీమేక్ చేశాడు. కానీ, ఆ సినిమా దారుణంగా ఫెయిల్ అయింది. ​

అక్షయ్ కుమార్ రీమేక్ కంటే, లారెన్స్ ఒరిజినల్ డబ్బింగ్ సినిమాలే బాగున్నాయని నార్త్ ఆడియెన్స్ ఫిక్స్ అయిపోయారు. అంటే, బాలీవుడ్ స్టార్ హీరో కూడా లారెన్స్ క్రియేట్ చేసిన ఆ సోల్‌ను, ఆ మ్యాజిక్‌ను రీ క్రియేట్ చేయలేకపోయాడు. ఈ ఫెయిల్యూర్, కాంచన 4కు వరంగా మారింది. రీమేక్‌ల కంటే, మీ ఒరిజినల్ డబ్బింగే మాకు కావాలి అని హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఫిక్స్ అవ్వడంతో, రేటు గట్టిగానే పెరిగింది. ​

ఈసారి లారెన్స్ కూడా చాలా స్మార్ట్‌గా ప్లాన్ చేశాడు. హిందీ ఆడియెన్స్‌ను మరింతగా ఎట్రాక్ట్ చేయడానికి, పాన్ ఇండియా అప్పీల్ ఉన్న పూజా హెగ్డే, నోరా ఫతేహిలను హీరోయిన్లుగా తీసుకున్నాడు. వీళ్ల గ్లామర్, డ్యాన్స్ సినిమాకు అదనపు అట్రాక్షన్. ​దానికి తోడు, సౌత్ సినిమాలను హిందీలో డబ్ చేసి, యూట్యూబ్‌లో కాంచన బ్రాండ్‌ను పెంచి పెద్ద చేసిన గోల్డ్ మైన్ ఫిలిమ్స్ సంస్థే, ఇప్పుడు కాంచన 4 నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. దీంతో, హిందీ రిలీజ్, ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నాయి. మొత్తం మీద, ఔట్ డేట్ అయిందనుకున్న జానర్‌తోనే, బాలీవుడ్ ఫెయిల్యూర్నే తన బ్రాండ్ వాల్యూగా మార్చుకుని, లారెన్స్ వంద కోట్లను అప్పుడే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో చూడాలి.