ఆ హీరోయిన్ తో బాలీవుడ్ నటుడి రొమాంటిక్ థ్రిల్లర్
రీసెంట్ గా బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాలో తన యాక్టింగ్ కు ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు రాఘవ్ జుయల్.
By: Sravani Lakshmi Srungarapu | 10 Oct 2025 3:00 AM ISTరీసెంట్ గా బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాలో తన యాక్టింగ్ కు ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు రాఘవ్ జుయల్. బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ తో వచ్చిన సక్సెస్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్న రాఘవ్, హీరోయిన్ సయీ మంజ్రేకర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ కు కామెంట్ చేసి వార్తల్లో నిలిచారు.
సయీ పోస్ట్ కు రాఘవ్ కామెంట్
సయీ రీసెంట్ గా తన స్కిన్ కేర్ రొటీన్ ను ప్రదర్శించే బ్యూటీ నేపథ్య వీడియోను పోస్ట్ చేయగా, దానికి రాఘవ్ "షూట్ పే లే ఆనా యే సబ్"(షూటింగ్ టైమ్ లో ఇవన్నీ పొందండి) అంటూ కామెంట్ చేశారు. సయీ పోస్ట్ పై రాఘవ్ కామెంట్ చేయడంతో వీరిద్దరూ కలిసి త్వరలోనే స్క్రీన్ ను షేర్ చేసుకోనున్నారని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రాఘవ్ జుయల్, సయీ ఓ రొమాంటిక్ సినిమా కోసం వర్క్ చేయనున్నారని తెలుస్తోంది.
స్పెషల్ ఎట్రాక్షన్ గా హీరోహీరోయిన్ కెమిస్ట్రీ
వీరిద్దరి జంట చాలా కొత్తగా, ఎవరూ ఊహించని విధంగా ఉండటంతో పాటూ, అటు సయీ, ఇటు రాఘవ్ ఇద్దరూ మంచి నటులు కావడంతో, వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే అందులో వారి యాక్టింగ్ సినిమాకు ఓ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారనుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ సినిమా రొమాంటిక్ అంశాలతో పాటూ, కొన్ని ఉత్కంఠభరితమైన అంశాలను ఎలివేట్ చేస్తూ ఉంటుందని సన్నిహిత వర్గాలంటున్నాయి.
బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ సక్సెస్ తర్వాత రాఘవ్ జుయల్ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ, ప్రామిసింగ్ న్యూ ఏజ్డ్ యాక్టర్ గా ఎదుగుతున్నారు. రాఘవ్, సయీ కలిసి మొదటిసారి చేయబోయే ఈ రొమాంటిక్ థ్రిల్లర్ అధికారిక ప్రకటన కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఆ అనౌన్స్‌మెంట్ ఎప్పుడొస్తుందో, ఆ ప్రాజెక్టుకు ఎవరు దర్శకత్వం వహించనున్నారో చూడాలి.
