Begin typing your search above and press return to search.

నాని ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్..!

న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే.

By:  Ramesh Boddu   |   6 Oct 2025 11:27 AM IST
నాని ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్..!
X

న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. దసరా తర్వాత మళ్లీ శ్రీకాంత్ ఓదెల కి ఛాన్స్ ఇచ్చిన నాని ఈసారి నెక్స్ట్ లెవెల్ ప్లాన్ తో వస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ది ప్యారడైజ్ సినిమాలో నాని జడల్ రోల్ లో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్ విలన్ గా నటిస్తున్నాడు.

తెలుగు సినిమాను గ్లోబల్ లెవెల్ కి..

రీసెంట్ గా ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమాలో నటించాడు రాఘవ్. ఐతే నాని ది ప్యారడైజ్ పై రాఘవ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ది ప్యారడైజ్ సినిమా ఇంటర్నేషనల్ మూవీ అని అంటున్నాడు అతను. ఈ సినిమా కోసం అతను తెలుగు కూడా నేర్చుకుంటున్నాడట. ది ప్యారడైజ్ సినిమా తెలుగు సినిమాను గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్తుందని అంటున్నాడు. యాక్టర్ గా తను డెడికేటెడ్ గా చేయాలనే ఉద్దేశంతో తెలుగు నేర్చుకుని మరీ సొంత డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నాడట రాఘవ్.

సినిమా పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్ ఇంప్రెస్ చేస్తుంది. ఇక నాని మరోసారి తన మాస్ స్టామినాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయనున్నాడు. నాని, శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కలిసి మరోసారి మ్యాజిక్ చేస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఐతే ది ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఎవరు అందుకున్నారు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. నాని పిలవాలే కానీ ఏ హీరోయిన్ అయినా చేసేందుకు రెడీ అంటుంది. నాని ఆల్రెడీ ఆమధ్య ఒక అవార్డ్ ఫంక్షన్ లో నెక్స్ట్ శ్రీకాంత్ షర్ట్ వెనుక ఉన్న కాకి ఈ అవార్డులన్నీ ఎత్తుకెళ్తుందని అన్నాడు.

నాని ప్యారడైజ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..

సో నాని సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే అది ఫిక్స్ అయ్యాడన్నమాట. నాని ది ప్యారడైజ్ సినిమా 2026 మార్చి 26 రిలీజ్ లాక్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్ కి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. నాని ప్యారడైజ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నటిస్తున్నారు. సినిమాలో ఆయన విలన్ అని తెలిస్తుండగా మళ్లీ రాఘవ్ జుయల్ ని కూడా దించుతున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంటాయని టాక్.