Begin typing your search above and press return to search.

అనుమాన పక్షిగా మారిన యంగ్ యాక్టర్..!

ప్రస్తుతం యంగ్ యాక్టర్స్ లో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎలాంటి రోల్ అయినా రాగ్ మయూర్ సత్తా చాటుతున్నాడు.

By:  Ramesh Boddu   |   2 Oct 2025 1:21 PM IST
అనుమాన పక్షిగా మారిన యంగ్ యాక్టర్..!
X

సినిమాల మీద ఆసక్తితో ఎంతోమంది ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారిలో కొందరికే సరైన ఛాన్స్ లు వస్తాయి. ఆ వచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకున్న వారు కొందరైతే మిస్ యూజ్ చేసుకునే వారు మరికొందరు. ఈ క్రమంలో ఒక యంగ్ యాక్టర్ అనుమాన పక్షిగా మారాడు. ఈమధ్యనే కాస్త పేరొచ్చే పాత్రల్లో నటిస్తున్న ఈ యంగ్ యాక్టర్ ఇలా అనుమాన పక్షిగా మారడం వెనక రీజన్స్ ఏంటన్నది తెలియాలంటే ఇంకాస్త డీటైల్స్ లోకి వెళ్లాలి.

ఎలాంటి రోల్స్ అయినా చేస్తున్న నటుడు..

రాగ్ మయూర్ ఈమధ్య కాలంలో ఎలాంటి రోల్స్ అయినా చేస్తున్న నటుడు. షార్ట్ ఫిలింస్ తో మొదలు పెట్టిన అతని ప్రయాణం మెంటల్ మదిలో అలా అన్ క్రెడిటెడ్ రోల్ చేయగా సినిమా బండి సినిమాలో మెప్పించాడు. ఆ తర్వాత కీడా కోలా, శ్రీరంగ నీతులు, శుభం సినిమాల్లో నటించాడు. రీసెంట్ గా రిలీజైన పరదా సినిమాలో కూడా నటించాడు రాగ్ మయూర్. ఇతను మోడ్రెన్ లైఫ్ హైదరాబాద్, సివారపల్లి సీరీస్ లు కూడా చేశాడు.

ప్రస్తుతం యంగ్ యాక్టర్స్ లో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎలాంటి రోల్ అయినా రాగ్ మయూర్ సత్తా చాటుతున్నాడు. ఐతే ఇతను ఇప్పుడు అనుమాన పక్షిగా మారడం ఏంటంటే.. అతను నటిస్తున్న సినిమాకు అనుమాన పక్షి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డీజే టిల్లుతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. డీజే టిల్లు తర్వాత సిద్ధు జొన్నలగడ్డ రేంజ్ ఏంటో తెలిసిందే.

అనుమాన పక్షి రాగ్ మయూర్..

రాగ్ మయూర్ కి కూడా ఈ అనుమాన పక్షి కెరీర్ లో ఒక బ్రేక్ ఇచ్చే సినిమా అవ్వాలని చూస్తున్నారు. అనుమాన పక్షి రాగ్ మయూర్ నటిస్తున్న సినిమా.. ఈ సినిమా పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. డీజే టిల్లు తర్వాత విమల్ కృష్ణ కాస్త గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది.

సినిమాల్లో ఇప్పుడిప్పుడే మంచి రోల్స్ చేస్తూ వస్తున్న రాగ్ మయూర్ లీడ్ రోల్ లో అనుమాన పక్షి వస్తుంది. విమల్ కృష్ణ డైరెక్షన్ కాబట్టి ఈ సినిమాపై అంచనాలైతే బాగానే ఉన్నాయి. సో అనుమాన పక్షి టైటిలే చాలా డిఫరెంట్ గా ఉంది. మరి ఈ సినిమాతో రాగ్ మయూర్ ఎలా అలరిస్తాడు అన్నది చూడాలి.