Begin typing your search above and press return to search.

ఐదేళ్లలోనే ప్రామిసింగ్ స్టార్‌గా మారిన రాగ్ మయూర్.. ఇప్పుడు కొత్త అవతార్!

సినిమా బండితో మొదలైన అతని సినీ జ‌ర్నీ, ఇప్పటికే ఐదేళ్ల మైలురాయిని పూర్తి చేసుకోవడం విశేషం.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 May 2026 3:26 PM IST
ఐదేళ్లలోనే ప్రామిసింగ్ స్టార్‌గా మారిన రాగ్ మయూర్.. ఇప్పుడు కొత్త అవతార్!
X

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఏడాది ఎంతోమంది కొత్త నటులు వస్తుంటారు. కానీ వారిలో కొందరే తమ సహజమైన నటనతో, స్క్రీన్‌పై కనిపించే నిజాయితీతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తారు. అలాంటి యువ నటుల్లో రాగ్ మయూర్ ఒకరు. పెద్ద స్టార్ ఇమేజ్ లేకపోయినా, తన టాలెంట్‌ను నమ్ముకుని అడుగులు వేసిన ఈ నటుడు ఇప్పుడు తెలుగు సినిమాల్లో ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు.





సినిమా బండితో మొదలైన అతని సినీ జ‌ర్నీ, ఇప్పటికే ఐదేళ్ల మైలురాయిని పూర్తి చేసుకోవడం విశేషం. చిన్న పాత్రల నుంచి గుర్తింపు వచ్చే క్యారెక్టర్ల వరకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ కెరీర్లో ముందుకొచ్చిన రాగ్ మయూర్, ఈ జెన‌రేష‌న్ కు చెందిన ప్రామిసింగ్ నటుడిగా ఇండస్ట్రీలో నిలుస్తున్నాడు. 2021లో రిలీజైన సినిమా బండి రాగ్ మయూర్ కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారింది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఆ సినిమాలో అతను చూపించిన నేచుర‌ల్ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ, నేటివిటీకి దగ్గరగా ఉండే బాడీ లాంగ్వేజ్, ఎలాంటి ఓవర్ డ్రామా లేకుండా పాత్రను జీవించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అతను వెబ్ కంటెంట్ వైపు కూడా అడుగులు వేసి తన పరిధిని మరింత విస్తరించుకున్నాడు.

ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ వంటి ప్రాజెక్ట్‌లతో డిజిటల్ ఆడియెన్స్‌లో కూడా గుర్తింపు సంపాదించాడు. స్క్రీన్ టైమ్ తక్కువైనా, కనిపించిన ప్రతి సన్నివేశంలో తన ప్రత్యేకతను చూపించగల నటుడిగా రాగ్ మయూర్ పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కంటెంట్ బేస్డ్ సినిమాలకు పెరుగుతున్న ఆదరణ మధ్య, సహజ నటనకు ప్రాధాన్యం పెరగడం అతనిలాంటి నటులకు మరింత ప్లస్ అవుతోంది.

ఇక ఇప్పుడు రాగ్ మయూర్ తన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన అడుగు వేయడానికి సిద్ధమవుతున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న అనుమాన పక్షి సినిమాలో అతను ఫ్రెష్, ఫన్ రోల్‌లో కనిపించనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఎక్కువగా నేచురల్, రియలిస్టిక్ క్యారెక్టర్లలో కనిపించిన రాగ్ మయూర్, ఈసారి కామెడీ టచ్ ఉన్న ఎంటర్‌టైనింగ్ పాత్రలో అలరించబోతుండటం ఆసక్తిని పెంచుతోంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌పై డిస్క‌ష‌న్స్ మొద‌లయ్యాయంటే, అతనికి ఆడియ‌న్స్ లో ఎంత కనెక్ష‌న్ ఏర్పడిందో అర్థం చేసుకోవ‌చ్చు. గత ఐదేళ్లలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన రాగ్ మయూర్, ఇకపై మరిన్ని విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్‌డమ్ కంటే నటనకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్న ఈ యువ నటుడి ప్రయాణం టాలీవుడ్‌లో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తీసుకునేలా కనిపిస్తోంది.