23 సార్లు చెంప దెబ్బలు కొట్టా!
మెగాస్టార్ చిరంజీవి - రాధికాలది ప్రత్యేకమైన జోడీ. ఇద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
By: Srikanth Kontham | 27 April 2026 8:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి - రాధికాలది ప్రత్యేకమైన జోడీ. ఇద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. వ్యక్తిగతంగానూ మంచి స్నేహితులు. తాజాగా రాధిక కెరీర్ ప్రారంభంలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసు కున్నారు. `న్యాయం కావాలి` సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశం కోసం రాధిక చిరంజీవిని ఏకంగా 23 సార్లు చెంపదెబ్బలు కొట్టాల్సి వచ్చిందన్నారు. ఆ సన్నివేశం వివరాల్లోకి వెళ్తే కథా పరంగా రాధిక పాత్ర చిరంజీవిని కొట్టాల్సి ఉంటుంది. అయితే ఆ సీన్ పర్ఫెక్ట్‌గా రావాలని దర్శకుడు పదే పదే రీటేక్‌లు తీసుకున్నారట.
దాంతో రాధిక దాదాపు 23 సార్లు చిరంజీవి చెంపపై కొట్టారు. ఆ దెబ్బల ధాటికి మెగాస్టార్ చెంపలు ఎర్రబడిపో యాయట. అనంతరం షూటింగ్ విరామ సమయంలో చిరంజీవి దగ్గరకు వెళ్లి రాధిక క్షమాపణలు కూడా కోరారని తెలిపారు. వృత్తి పట్ల చిరంజీవికి ఉన్న అంకితభావం అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచేదని కొనియాడారు. చిరంజీవి ఎంతటి అగ్ర నటులైనా? తోటి నటీనటులతో ఎంతో సరదాగా ఉంటారని వెల్లడించారు. షూటింగ్ సమయంలో జరిగిన ఇలాంటి కష్టమైన అనుభవాలను కూడా చిరంజీవి ఎంతో హుందాగా స్వీకరించే వారన్నారు.
23 సార్లు కొట్టినా కోపం తెచ్చుకోలేదు. సీన్ బాగా రావాలని ప్రోత్సహించారని రాధిక చెప్పుకొచ్చారు. ఈ ఘటన జరిగిన నాటి నుండి నేటి వరకు ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది తప్ప ఏనాడూ తగ్గలేదన్నారు. నటనలోనే కాదు. వంట గదిలో కూడా చిరంజీవి అద్భుతాలు చేస్తారని రాధిక మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. చిరంజీవి దోశెలు వేయడంలో నిజంగానే మాస్టర్ అని ప్రశం సించారు. షూటింగ్ విరామాల్లో లేదా సెలబ్రిటీ గెట్-టుగెదర్‌లలో చిరంజీవి స్వయంగా దోశెలు వేసి అందరికీ వడ్డిస్తారన్నారు.
ఆయన వేసే దోశెల రుచి మరెక్కడా దొరకదని సంతోషంగా వ్యక్తం చేసారు. మెగాస్టార్ కు వంట చేయడం అంటే ఆసక్తే. ముఖ్యంగా ఆయన స్వయంగా కనిపెట్టిన `చిరంజీవి దోశె`కు ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. అప్పుడప్పడు చిరంజీవి తనకు బాగా కావాల్సిన స్నేహితులకు స్పెషల్ దోశెను తినిపిస్తుంటారు. ఒక నటుడిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న చిరంజీవి ఆప్యాయతతో తోటి నటులను కూడా మెప్పించడం మెగాస్టార్ గొప్పత నానికి నిదర్శనం. వెండితెరపై చూసే గ్లామర్ వెనుక నటీనటులు పడే కష్టం వారు పంచుకునే అనుబంధాలు ఎంతో విలువైనవి. ప్రస్తుతం చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అలాగే `విశ్వంభర` షూటింగ్ కూడా పూర్తి చేసారు. కానీ రిలీజ్ తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు.
