Begin typing your search above and press return to search.

రాధిక మూవీ.. చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌ గా తమిళ, తెలుగు భాషల్లో అనేక హిట్ సినిమాల్లో నటించిన సీనియర్ నటి రాధిక శరత్‌ కుమార్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు.

By:  M Prashanth   |   10 March 2026 10:51 AM IST
రాధిక మూవీ.. చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్?
X

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌ గా తమిళ, తెలుగు భాషల్లో అనేక హిట్ సినిమాల్లో నటించిన సీనియర్ నటి రాధిక శరత్‌ కుమార్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త చిత్రాల్లో నటిస్తూ.. తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆమె లీడ్ రోల్ లో నటించిన తాయి కిళవి సినిమా విజయంతో మరోసారి వార్తల్లో నిలిచారు.

రీసెంట్ గా ఫిబ్రవరి 27వ తేదీన రిలీజైన ఆ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. విడుదలైన మొదటి షో నుంచి అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది. సినిమాలో రాధిక 75 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించగా.. ఆమె యాక్టింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మూవీ స్టోరీతోపాటు ఎమోషనల్ సీన్స్.. ఆడియన్స్ ను ఫుల్ గా ఆకట్టుకున్నాయి. అలా రాధిక నటన, స్టోరీ.. ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తున్నాయి.

దీంతో బాక్సాఫీస్ వద్ద సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. రిలీజ్ అయిన తొలి వారంలో రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు పది రోజుల్లో ఏకంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అబ్బురపరిచింది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో మేకర్స్ వెల్లడించారు. దీంతో ఇప్పుడు తాయి కిళవి సినిమా కోసమే అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.

అయితే ఒక సీనియర్ నటి లీడ్ రోల్ లో నటించిన సినిమా ఇంత తక్కువ సమయంలో అంతటి రేంజ్ వసూళ్లు సాధించడం అరుదైన విషయమనే చెప్పాలి. ముఖ్యంగా ఒక బామ్మ పాత్ర చుట్టూ తిరిగే కథతో రూపొందిన మూవీ.. భారీ కమర్షియల్ విజయం అందుకోవడం కూడా రేర్. అదే సమయంలో 60 ఏళ్లు పైబడిన నటి లీడ్ రోల్‌ లో నటించిన చిత్రం ఆ రేంజ్ విజయం సాధించడం కోలీవుడ్ చరిత్రలో తొలిసారి అని తెలుస్తోంది.

కాగా.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ.. తాయి కళవి మూవీతో రాధిక అరుదైన మైలురాయి అందుకోవడం మరో విశేషం. ఆ మూవీని ప్రముఖ నటుడు శివకార్తికేయన్ సమర్పించారు. దర్శకుడు శివకుమార్ మురుగేసన్ సినిమాను ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ స్టోరీతో తెరకెక్కించి.. డెబ్యూతో హిట్ అందుకున్నారు. అంతే కాదు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

ఇక సినిమా విడుదలకు ముందే తాయి కిళవిపై ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడింది. ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు రాధిక బామ్మ పాత్రలో కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. అలాగే శివకార్తికేయన్ సినిమాను సమర్పించడం మరిన్ని అంచనాలను పెంచింది. ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి వాటిని అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఓవరాల్ గా తాయి కిళవి మూవీ ఎంతటి వసూళ్లు సాధిస్తుందో.. ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అంతా వేచి చూడాలి.