తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!
రాధికా ఆప్టే మేనమామ వివాహ సంప్రదాయంపై చేసిన వ్యాఖ్యల సమయంలో తాను మౌనంగా ఉండటంపై వచ్చిన విమర్శలకు కీర్తి సురేష్ స్పందించారు. మొదట రాధిక ఏం మాట్లాడుతున్నారో తనకు అర్థం కాలేదని, తర్వాత దక్షిణాదిలోని ఆచారం గురించి చెబుతున్నారని గ్రహించి వివరించే ప్రయత్నం చేశానని తెలిపారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంప్రదాయం ఉందని, కేరళలో లేదని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. తన దక్షిణాది మూలాలు, సంస్కృతిపై ఎప్పుడూ గర్వంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘సత్యవాన్ సావిత్రి’లో లాయర్ పాత్రలో నటిస్తున్నారు.
By: Srikanth Kontham | 20 Nov 2026 1:06 PM ISTమేనమామ వివాహ సంప్రదాయం పై బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే. సరిగ్గా ఈ ఘటన `అక్క` వెబ్ సిరీస్ ప్రమోషన్ సమయంలో జరిగింది. రాధికా ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో కీర్తి సురేష్ కూడా పక్కనే ఉంది. కానీ కీర్తి ఎలాంటి కామెంట్ చేయలేదు.అసలు తనకు సంబంధమే లేనట్లు వ్యవహరించింది. ఈ నేపథ్యంలో కీర్తి పై నెగిటివిటీ వ్యక్తమైంది. తాజాగా ఈ అంశంపై కీర్తి స్పందించింది. `రాధిక అంకుల్‌తో రొమాన్స్ అంటూ మాట్లాడినప్పుడు అసలు ఆమె దేని గురించి చెబుతుందో? నాకు ఏమాత్రం అర్థం కాలేదు.
కాసేపటి తర్వాత రాధిక దక్షిణాదిలో ఉన్న మేనమామ పెళ్లి ఆచారం గురించి మాట్లాడుతున్నారని గ్రహించి రాధికకు ఆ సంప్రదాయంపై అవగాహన లేదని తెలుసుకుని వెంటనే వివరించే ప్రయత్నం చేశానన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ ఆచారం ఉంది కానీ కేరళలో లేదని అన్న మాటలపైనా కొందరు విమర్శలు గుప్పించారు. దీనిపై కూడా కీర్తి వివరణ ఇచ్చింది. `దక్షిణాదిలో ప్రాంతాల వారీగా ఉండే ఆచారాల తేడాను మాత్రమే ఆ సందర్భంగా ప్రస్తావించానన్నారు. నా సొంత సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం ఎప్పుడూ ఉండదన్నారు.
హిందీలో సినిమాలు చేస్తున్నా మూలాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోను. అక్కడ పెద్ద హీరోయిన్ గా ఎదిగినా దక్షిణాది నటిగానే గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడతాను. సొంత భాష..సంస్కృతి ని తక్కువ చేసే వారి విషయంలో ఎప్పుడు మద్దతుగా ఉండను` అన్నారు. కీర్తి సురేష్ మలయాళ నటి మేనక కుమార్తెగా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మలయాళంలో అప్పట్లో మేనక పెద్ద హీరోయిన్. అయినా తల్లి ప్రభావం ఎక్కడా తనపై పడకుండా కీర్తి పరిశ్రమలో ఎదిగింది. అక్కడ నుంచి టాలీవుడ్ లో అగ్ర నటిగా ఎలా ఎదిగందన్నది తెలిసిందే.
`మహానటి` సినిమాతో పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. ఆ సినిమా ఇచ్చిన గుర్తింపు కీర్తి సురేష్ కెరీర్ లో చిరస్మరణీయమైంది. అయితే అదే ఐడెంటిటీ కీర్తి కొంత ప్రతికూలంగానూ మారింది. వచ్చిన ఎన్నో అవకాశా లను వదులుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే దూరమైంది. కానీ మడి కట్టుకుని కుర్చుంటే వున్న అవకాశాలు కూడా చేజారిపోతాయని గ్రహించిన అమ్మడు కాలక్రమంలో నిబంధనలు పక్కనబెట్టి పని చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం అవకాశాలు బాగానే అందుకుంటుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో `సత్యవన్ సావిత్రి` తెరకెక్కుతోంది. ఇందులో అమ్మడు లాయర్ పాత్రలో నటిస్తుంది. ఇంకా కొన్ని సినిమాలు సెట్స్ లో ఉన్నాయి.
