Begin typing your search above and press return to search.

41 ఏళ్ల వయసులోనే నా శరీరానికీ, కోరికలకూ క్లారిటీ!

ఈ సందర్భంగా సమాజంలో వయసు మళ్లడం , మహిళల లైంగికతపై ఉన్న సామాజిక అపోహలు పై రాధికా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Srikanth Kontham   |   28 Sept 2026 10:00 PM IST
41 ఏళ్ల వయసులోనే నా శరీరానికీ, కోరికలకూ క్లారిటీ!
X

బాలీవుడ్‌లో విలక్షణ నటిగా, ధైర్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే తాజాగా 'లస్ట్ స్టోరీస్ 3' సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇటీవలే 41వ పడిలోకి అడుగుపెట్టిన రాధిక‌ ఈ ప్రాజెక్ట్‌లో 40 ఏళ్ల వయసున్న మహిళ కోరికలు, లైంగికతను ప్రతిబింబించే పాత్రలో నటించారు. ఈ సందర్భంగా సమాజంలో వయసు మళ్లడం , మహిళల లైంగికతపై ఉన్న సామాజిక అపోహలు పై రాధికా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వయసు పెరగడాన్ని ఏదో కోల్పోవడంగా చూడటంపై రాధికా అసంతృప్తి వ్యక్తం చేశారు.

`మన సమాజం వయసు పట్ల ఎంతో విచక్షణ చూపుతుంది. కానీ నాకు 41 ఏళ్లు వచ్చిన సమయంలో నా 20లు , 30ల వయసు కంటే కూడా ఇప్పుడే నా శరీరం, నా అవసరాల గురించి మరింత స్పష్టమైన అవగాహన వచ్చింది. 20లలో తల్లిదండ్రులు వద్దన్న పనులు చేయడంలో.. 30లలో వారి మాటలే నిజమేమో అని భయపడటంలో గడిపోతుంది. కానీ 40లలో సొంత స్థానాన్ని, జీవితంపై స్పష్టతను కనుగొంటాం` అని వ్యాఖ్యానించారు. తన జీవితంలో అత్యంత చైతన్యవంతంగా, యంగ్‌గా అనిపించేది 40లలోనే అని రాధికా నమ్మకాన్ని వ్య‌క్తం చేసారు.

`ఈ వయసే కోరికలు, అవసరాలను గుర్తించడంలో అత్యుత్తమ సమయం. ముఖ్యంగా మాతృత్వం అనుభవంలోకి వచ్చాక, శరీరం పూర్తిగా మారుతుంది . మన శరీర అవసరాలు ఏంటో? స్పష్టంగా అర్థమవుతాయి. వయసు పెరగడం వల్ల వచ్చే పరిపక్వతను గుర్తించని వారు నిజంగా జీవితంలో చాలా విషయాలను మిస్ అవుతున్నారు` అని చెప్పుకొచ్చారు.

భారతీయ సమాజంలో లైంగికత , కోరికల గురించి మాట్లాడటం ఇంకా పెద్ద టా...గా ఉండిపోయిందని అభి ప్రాయపడ్డారు. `లైంగికత పక్కనబెడితే, ప్రాథమిక సమానత్వం , స్వేచ్ఛగా ఆలోచించి మాట్లాడే వాతావరణం కూడా ఇంకా చాలా చోట్ల లేదు. చిన్నప్పుడు లైంగికత అంటే అదొక చెడు విషయం అనే భావనతోనే నేను కూడా పెరిగాను. కానీ పురుషుల కోరికలను ఒకలా, మహిళల కోరికలను మరొకలా ఎందుకు వేరు చేసి చూడాలి? అది ఇద్దరూ కలిసి పంచుకునే సహజమైన భావన? క‌దా అని ప్రశ్నించారు.

ఒక తల్లిగా కుమార్తె పెంపకం విషయంలో పూర్తి స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని అందించాలనుకుంటున్నట్లు రాధికా తెలిపారు. తాను చదివినఓ ఒక పుస్తకంలోని ఉదాహరణను ప్రస్తావిస్తూ చిన్నతనంలో లైంగిక అవగాహన సమయంలో ఎదురైన అవమానకర అనుభవాలు జీవితాంతం వెంటాడుతాయ‌న్నారు. `నా కుమార్తె కోరికలు లేదా భావాలను గుర్తించినప్పుడు ఆమెను సీరియస్‌గా కసిరడం లేదా సిగ్గుపడేలా చేయడం వంటివి నేను చేయకూడదని నిశ్చయించుకున్నాన` అని వివరించారు.