రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?
హీరో ఎవరో, తన పాత్ర ఏంటో ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
By: M Prashanth | 3 Nov 2026 9:48 AM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీపై బాలీవుడ్ హీరోయిన్లు విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో తాప్సీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదానికి దారితీశాయో తెలిసిందే. ఇప్పుడు రాధికా ఆప్టే కూడా అలాంటి కామెంట్స్‌తో నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో హీరోయిన్ల అభ్యంతరాలను పూర్తిగా కొట్టిపారేయలేం. అదే సమయంలో సినిమాల్లో నటించడానికి అంగీకరించిన తర్వాత కొన్నేళ్లకు వాటిపై విమర్శలు చేయడాన్ని కూడా కొందరు తప్పుబడుతున్నారు.
రాధికా ఆప్టే ఇటీవల అక్క ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందులో తన పాత్రను సొంత బంధువుతో పెళ్లికి సిద్ధం చేయడం, తనకంటే వయసులో చాలా పెద్ద హీరోతో నటించడం, సినిమా మధ్యలోనే పాత్రను చంపేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఆమె అక్కడ ఏదో కామెడీగా, సినిమా నచ్చనట్లు అదే రొటీన్ అన్నట్లు హైలెట్ చేయడ ఓ వర్గం నెటిజన్స్ కు నచ్చడం లేదు. ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ అసలు కథ నచ్చనప్పుడు సినిమా ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నిస్తున్నారు.
హీరో ఎవరో, తన పాత్ర ఏంటో ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో తాప్సీ కూడా తెలుగు సినిమా షూటింగ్ అనుభవాలపై ఇలాంటి విమర్శలే చేశారు. తన నాభిపై కొబ్బరికాయ వేసి పాట చిత్రీకరించడాన్ని ఓ ఇంటర్వ్యూలో సరదాగా ప్రస్తావించడం అప్పట్లో వివాదమైంది. ఆ తర్వాత తన ఉద్దేశం దర్శకుడిని అవమానించడం కాదని వివరణ ఇచ్చారు.
ఈ ఏడాది కూడా దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్‌కు ఇచ్చే ప్రాధాన్యం, షూటింగ్ సమయంలో ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడారు. ఇప్పుడు రాధికా వ్యాఖ్యలతో మరోసారి అలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. అయితే నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలోనూ పాయింట్ ఉంది. కథలోని కొన్ని అంశాలు నచ్చకపోతే సినిమా ఒప్పుకునే ముందే అభ్యంతరం చెప్పవచ్చు. ముఖ్యంగా సీనియర్ హీరోతో నటించడం విషయంలో వయసు తేడా ముందే తెలిసే అవకాశం ఉంటుంది.
కానీ షూటింగ్ సమయంలో జరిగే ప్రతి విషయం ముందుగానే నటీనటులకు తెలుస్తుందని అనుకోలేం. కథ చెప్పినప్పుడు ఉన్న సన్నివేశాలు సెట్స్ మీదకు వెళ్లాక మారవచ్చు. కొన్ని సందర్భాల్లో దర్శకుడి నిర్ణయాలను వ్యతిరేకించే పరిస్థితి కూడా హీరోయిన్లకు ఉండకపోవచ్చు. ఒక సినిమాలో నటించినంత మాత్రాన అందులోని ప్రతి సన్నివేశాన్ని వ్యక్తిగతంగా సమర్థించినట్లు కాదు. అలాగే తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పడం తప్పు కూడా కాదు.
కానీ ఒకరిద్దరు దర్శకులతో ఎదురైన పరిస్థితులను మొత్తం తెలుగు ఇండస్ట్రీకి ఆపాదిస్తే మాత్రం అభ్యంతరాలు రావడం సహజం. ఎందుకంటే హీరోయిన్లకు మంచి పాత్రలు ఇచ్చిన దర్శకులు, మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిన సినిమాలు కూడా తెలుగులో చాలానే ఉన్నాయి. రాధికా గతంలో తెలుగు సినిమా సెట్స్‌లో తనకు ఎదురైన ఇబ్బందులను చెప్పడంతో పాటు అక్కడి వ్యక్తులు తనను ఆప్యాయంగా చూసుకున్న సందర్భాలను కూడా గుర్తుచేసుకున్నారు. మరోవైపు స్థానిక నటీమణులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.
