హీరోయిన్ కి ఆ గౌరవం ఎప్పటికీ దక్కదు..
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఆప్టే హీరోలను ఎలివేట్ చేస్తూ.. హీరోయిన్లను తక్కువ చేసి చూపించే వారిపై మండిపడింది.
By: Madhu Reddy | 16 Oct 2025 8:00 PM ISTసినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుండి హీరోకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు రాయడం తప్ప.. హీరోయిన్ కి ప్రాధాన్యత ఉండే పాత్రలు రాయడం చాలా తక్కువ.. దశాబ్దాలుగా ఇదే రిపీట్ అవుతోందే తప్ప ఒక్క సినిమాలో కూడా హీరోయిన్ ని ఎక్కువ చేసి హీరోని తక్కువగా చూపించే సినిమాలు రావడం లేదు. అయితే ఇండస్ట్రీలో జరిగే ఇలాంటి విషయాలను ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది హీరోయిన్ రాధిక ఆప్టే. హిందీ,తమిళ,తెలుగు భాషలో హీరోయిన్ గా రాణించిన రాధిక ఆప్టే హీరోయిన్ల పట్ల జరిగే అన్యాయాన్ని వివక్షతను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఆప్టే హీరోలను ఎలివేట్ చేస్తూ.. హీరోయిన్లను తక్కువ చేసి చూపించే వారిపై మండిపడింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే మాట్లాడుతూ.. "సినిమా కథలు ఎక్కువగా హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్ గా చూపించడం వరకు మాత్రమే పరిమితం చేస్తారు. ఎప్పుడైనా సరే హీరోయిన్ హీరో వెనకాల ఉండేలా.. హీరోని కాపాడండి అని అడిగేలాంటి పాత్రల్లోనే చూపిస్తారు. హీరో ముందు ఉంటే హీరోయిన్ వెనకాల లేదా పక్కన నిల్చోవాలి అంతే.. హీరోయిన్ పాత్ర హీరోకి మద్దతు ఇవ్వడం వరకు మాత్రమే ఉంటుంది. ఆ సినిమాలో ఉండే సన్నివేశాలు అన్నీ కూడా హీరోని బలంగా చూపించడం కోసం మాత్రమే రాస్తారు తప్ప మహిళలను ఏ ఒక్క సన్నివేశంలో కూడా హైలెట్ చేసి చూపించరు. హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతారని అనుకుంటారు.. హీరోయిన్లను ఏ విధంగా వాడుకోవాలో కూడా తెలియడం లేదు. కేవలం గ్లామర్ బొమ్మలనే అనుకుంటున్నారు. అందుకే హీరోల లాంటి గౌరవం హీరోయిన్లకు ఎప్పటికీ దక్కదు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రాధిక ఆప్టే.
అయితే రాధిక ఆప్టే చేసిన ఈ వ్యాఖ్యల్లో 100% నిజం ఉంది.
ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా అందులో హీరోని ఎలివేట్ చేస్తూ హీరోయిజాన్ని చూపిస్తారు తప్ప హీరోయిన్ ని ఎవరు కూడా పట్టించుకోరు. కేవలం ఐటమ్ సాంగ్ లకు లేదా రొమాన్స్ చేసే పాత్రలకు మాత్రమే వారిని తీసుకుంటారు. మిగతా కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది.అందుకే రాధిక ఆప్టే ఇలాంటి కామెంట్స్ చేసింది.అయితే హీరోయిన్లను పెట్టి కూడా పవర్ ఫుల్ సినిమాలు తీయవచ్చని ప్రతిసారి ఈ అంశాన్ని ఎత్తి చూపుతుంది రాధిక ఆప్టే.
అటు రాధిక ఆప్టేతో పాటు చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉండే పురుషాధిక్యత గురించి ఎత్తిచూపుతూ ఉంటారు. కానీ దర్శకులు మాత్రం హీరోలను ఎలివేట్ చేయడం తప్ప హీరోయిన్లను పట్టించుకోరు. ఇక రాధిక ఆప్టే అనుభవంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఈ హీరోయిన్ నటించిన ఏ సినిమాలో కూడా ఈమెకు అంత స్కోప్ ఇవ్వలేదు. అందుకే నిరాశతో ఈ కామెంట్లు చేసినట్టు అర్థమవుతుంది.
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ బ్యూటీ గా నిలిచిన రాధిక ఆప్టే కేవలం హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇవ్వడం గురించే కాదు క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఓ పెద్ద హీరో తనని లైంగికంగా వేధించాడు అంటూ అప్పట్లో ఒక బిగ్ బాంబు పేల్చిన సంగతి మనకు తెలిసిందే. అలా ఏ విషయం అయినా సరే నిర్మోహమాటంగా చెప్పే రాధిక ఆప్టే తెలుగులో లెజెండ్,రక్త చరిత్ర, లయన్, రక్త చరిత్ర 2, కబాలి,ధోని వంటి సినిమాల్లో నటించింది.
