అంబానీ చిన్న కోడలు.. మామూలు లుక్ కాదు ఇది!
అంబానీ కుటుంబంలోకి చిన్న కోడలిగా చేరిన తర్వాత రాధికా అంబానీ.. అటు వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తూ ఇటు ఫ్యాషన్ వరల్డ్ లో తనదైన స్టైల్ తో ఆకట్టుకుంటున్నారు.
By: M Prashanth | 23 Feb 2026 1:06 PM ISTఅంబానీ కుటుంబంలోకి చిన్న కోడలిగా చేరిన తర్వాత రాధికా అంబానీ.. అటు వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తూ ఇటు ఫ్యాషన్ వరల్డ్ లో తనదైన స్టైల్ తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆమె ధరించిన డ్రెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ హౌస్ చానెల్ హాట్ కౌట్యూర్ కలెక్షన్ లో భాగమైన స్పెషల్ డ్రెస్ లో రాధిక మెరిశారు.
ఆ డ్రెస్ లో వెస్ట్రన్ డిజైన్ తో పాటు ఇండియన్ ట్రెడిషన్ క్లియర్ గా కనిపించింది. సాటిన్ సూట్ కు ధోతి స్టైల్ ను గుర్తు చేసే స్కర్ట్ యాడ్ చేయగా, పైగా ట్వీడ్ కోట్ తో క్లాసిక్ లుక్ తీసుకొచ్చారు. కోట్ పై పెరల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ డిజైన్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచింది లెజెండరీ డిజైనర్ కార్లర్ లాగర్ ఫీల్డ్ రూపొందించిన పారిస్- బాంబే మీటియర్ డార్ట్ కలెక్షన్.
ఇండియన్ ట్రెడిషన్ ను సూచించే ఎలిమెంట్స్ ను ఇంటర్నేషనల్ ఫ్యాషన్ తో కలిపిన ఆ స్టైల్ ను మళ్లీ గుర్తు చేసేలా రాధిక అవుట్ ఫిట్ ఉందనే చెప్పాలి. ఆమె వేసుకున్న ఆర్నమెంట్స్ ను ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ఆమ్రపాలి జ్యూవెలర్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. నవరత్నాల బటన్లు, ముత్యాల డీటైలింగ్ తో డ్రెస్ కు రాయల్ టచ్ తీసుకొచ్చింది.
కస్టమ్ షూస్ తో పాటు డిజైనర్ అనామిక ఖన్నా రూపొందించిన హ్యాండ్ బ్యాగ్ ఆమె లుక్ ను గ్రాండ్ గా మార్చాయి. అటు ట్రెడిషనల్, ఇటు ఫ్యాషన్ కలయికగా ఆమె స్టైల్ నిలిచింది. దీంతో రాధిక అవుట్ ఫిట్ అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. బాగా సెట్ అయిందని, ఫ్యాషన్ ఐకాన్, సూపర్ మేడమ్ అని కామెంట్లు పెడుతున్నారు.
ఇక రాధికా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే, ప్రముఖ వ్యాపారవేత్త వీరన్ మర్చంట్ కుమార్తె అయిన ఆమె కొన్ని నెలల క్రితం తన చిన్ననాటి స్నేహితుడు అనంత్ అంబానీని వివాహం చేసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార కుటుంబాల్లో ఒకటైన అంబానీ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టారు.
అనంత్ తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కాగా.. ఆ ఫ్యామిలీ దేశవ్యాప్తంగా తమ బిజినెస్ కింగ్డమ్ తో ప్రత్యేక గుర్తింపు పొందింది. అలాంటి కుటుంబంలోకి వచ్చినా రాధికా తన కెరీర్ పై కంప్లీట్ ఫోకస్ పెట్టడం విశేషం. తన తండ్రి సంస్థ ఎన్కోర్ హెల్త్ కేర్ డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రాధికా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ లో తమ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
అలా ఒకవైపు ఫ్యాషన్ రంగంలో గ్లామర్ తో మెరిసిపోతూ, మరోవైపు వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాధికా అంబానీ ముందుకు సాగుతున్నారు. ఏదేమైనా ఆమె ఇప్పుడు కేవలం అంబానీ కుటుంబ కోడలు మాత్రమే కాదు. ఫ్యాషన్ ఐకాన్ గా, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ గా, కొత్త జనరేషన్ కు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారని చెప్పాలి.
