కూలీ సినిమాలో సైమన్ కొడుకు ప్రేయసిగా కనిపించిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?
ఇకపోతే ఈ సినిమాలో ఒక లేడీ విలన్ అందరిని ఆశ్చర్యపరిచింది. డబ్బు కోసం సైమన్ కుమారుడిని వలలో వేసుకునే మహిళగా చాలా అద్భుతంగా నటించింది.
By: Madhu Reddy | 16 Aug 2025 1:28 AM ISTసూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఆగస్టు 14న విడుదలైన చిత్రం కూలీ. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున విలన్ గా నటించిన ఈ సినిమాలో ఉపేంద్ర, శృతిహాసన్, అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా సత్యరాజ్ , సౌబిన్ షాహిర్ వంటి ప్రముఖులు కూడా నటించారు. ఇందులో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది ప్రముఖ హీరోయిన్. ఆమెను చూసిన తర్వాత ఒక హీరోయిన్ని విలన్ ను చేశారు కదరా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఆమె ఎవరు? ఏ పాత్రలో నటించింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఇకపోతే ఈ సినిమాలో ఒక లేడీ విలన్ అందరిని ఆశ్చర్యపరిచింది. డబ్బు కోసం సైమన్ కుమారుడిని వలలో వేసుకునే మహిళగా చాలా అద్భుతంగా నటించింది. కూలీ సినిమాలో ఆమె నటనకు థియేటర్లలో క్లాప్స్ కూడా కొడుతున్నారు ఆడియన్స్. అంతలా తన క్యారెక్టర్ తో ఈమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ లను చూసి ఆడియన్స్ తెగ థ్రిల్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్. ఈమె తెలుగులో చేసింది ఒకటే..ఆ సినిమా కూడా డిజాస్టర్ అవడంతో మళ్లీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.
అసలు విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండవ మాజీ భర్త కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమాతో రచితా రామ్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈమె నటించిన తెలుగు చిత్రం కూడా ఇదొక్కటే కావడం గమనార్హం. ఇది కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రచితా రామ్ కన్నడలో స్టార్ హీరోయిన్.. పునీత్ రాజ్ కుమార్, ఉపేంద్ర, ధ్రువ్ సర్జ , సుదీప్, దర్శన్, శివరాజ్ కుమార్ ఇలా తదితర హీరోలతో కలిసి సూపర్ హిట్ చిత్రాలలో నటించి నటిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది.
ఇకపోతే కన్నడ ఆడియన్స్ ఈమెను డింపుల్ క్వీన్ అని కూడా ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అంతేకాదు ఇంస్టాగ్రామ్ లో కూడా అత్యధిక ఫాలోవర్ లు ఉన్న హీరోయిన్గా కూడా గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమెకు ఇంస్టాగ్రామ్ లో 2.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెకు నిత్యా రామ్ అనే ఒక సిస్టర్ కూడా ఉంది. ప్రస్తుతం కన్నడ సీరియల్స్ లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూలీ సినిమాలో విలన్ పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కూలీ సినిమా విషయానికి వస్తే.. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సుమారుగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.
