వాళ్లకేమో గానీ ఈమెకి మాత్రం కలిసొచ్చిందిలా!
ఆ సంగతి పక్కన బెడితే ఈ సినిమా ఎంతమందికి కలిసొచ్చినా? రాకపోయినా ఓ నటికి మాత్రం 30 సినిమాలు తీసుకురాని గుర్తింపు ఒక్క `కూలీ` తీసుకొచ్చిందన్నది కాదనలేని వాస్తవం.
By: Srikanth Kontham | 20 Aug 2025 7:00 AM ISTఇటీవలే భారీ అంచనాల మధ్య `కూలీ` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. 1000 కోట్ల వసూళ్లు తమిళ పరిశ్రమకు అందించే చిత్రంగా ట్రేండ్ అంచనా వేసింది గానీ పనవ్వలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శ్రుతిహాసన్ ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమా ఇది. ఎంత మంది ఉన్నా? కంటెంట్ లేని చిత్రమన్నది నేటి రోజుల్లో ఆడటం కష్టం అన్నది తెలిసిందే.
ఆ సంగతి పక్కన బెడితే ఈ సినిమా ఎంతమందికి కలిసొచ్చినా? రాకపోయినా ఓ నటికి మాత్రం 30 సినిమాలు తీసుకురాని గుర్తింపు ఒక్క `కూలీ` తీసుకొచ్చిందన్నది కాదనలేని వాస్తవం. ఆమె రచిత రామా. ఈ సినిమాలో అమ్మడి పాత్రకు మంచి పేరొచ్చింది. సినిమాలో కీలకమైన రోల్ కాకపోయినా? కనిపిం చినంత సేపు మెరిసింది. సైమన్ కుమారుడుని వలలో వేసే పాత్రతో మెప్పించింది. నెగిటివ్ రోల్ కు మంచి రెస్పా న్స్ వచ్చింది. `కూలీ` చూసిన తర్వాత రచిత రామ్ గురించి ఇంటర్నెట్ లో సెర్చింగ్ పెరిగింది.
ఎవరు ఈ నటి అంటూ కుర్రకారంతా తెగ వెతికారు. రచిత రామ్ దశాబ్దం క్రితమే శాండిల్ వుడ్ లో హీరోయిన్ గా లాంచ్ అయింది. అక్కడ స్టార్ హీరోలతో కొన్ని సినిమాలు చేసింది. అలాగే తెలుగు నటుడు కళ్యాణ్ దేవ్ నటించిన `సూపర్ మచ్చి`తో ఇక్కడా లాంచ్ అయింది. అయితే ఈ సినిమాలేవి రచితకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. చాలా సినిమాల్లో నటించానని చెప్పుకోవడానికి తప్ప ఫలితాలు నిరాశ పరచడంతో ఆడియన్స్ కు చేరలేదు.
కానీ `కూలీ` మాత్రం అగ్ర తారల చిత్రం కావడంతో అమ్మడికి మంచి రీచ్ సాధ్యమైంది. ఇకపై కొత్త అవకాశాలు ఊపందుకునే ఛాన్స్ ఉందని సొగసరి నమ్మకంగా ఉంది. ఇప్పటికే నాలుగైదు సినిమాలు కమిట్ అయింది. అవి ఆన్ సెట్స్ లో ఉన్నాయి. `శబరి సెర్చింగ్ ఫర్ రావణ్`, `లవ్ మీ ఆర్ హేట్ మీ`, `ఆయోగ్య 2`, `కల్ట్`, `రాచయ్య` చిత్రాల్లో నటిస్తోంది.
