ఫిక్షనల్ స్టోరీతో మర్డర్ మిస్టరీకి సీక్వెల్
థియేటర్లలో రిలీజైన సినిమాలే కాదు, కొన్నిసార్లు ఓటీటీలో రిలీజైన సినిమాలు కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి.
By: Sravani Lakshmi Srungarapu | 5 Nov 2025 3:00 AM ISTథియేటర్లలో రిలీజైన సినిమాలే కాదు, కొన్నిసార్లు ఓటీటీలో రిలీజైన సినిమాలు కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఒక సినిమా హిట్టైతే దానికి కొనసాగింపుగానో లేదా ఆ ఫ్రాంచైజ్ లోనో మరికొన్ని సినిమాలను తీసుకొస్తుంటారు. 2020లో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన రాత్ అకేలి హై సినిమాకు ఆడియన్స్ నుంచి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే.
థ్రిల్లర్ మూవీ లవర్స్ నుంచి మంచి ప్రశంసలు
కొత్తగా పెళ్లైన ఇంటి యజమాని హత్యకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో గ్రిప్పింగ్ మిస్టరీగా వచ్చిన ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ పోలీసాఫీసర్ గా కనిపించి తన యాక్టింగ్ తో మెప్పించారు. థ్రిల్లర్ మూవీ లవర్స్ నుంచి కూడా ఈ సినిమాకు ఎంతో గొప్ప ప్రశంసలొచ్చాయి. అలాంటి సూపర్ హిట్ మూవీకి ఇప్పుడు రెండో భాగంగా రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్ తో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నారు.
56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మొదటిగా స్క్రీనింగ్
కాగా రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్ మూవీ మొదటిగా నవంబర్ లో జరిగే 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ కానుంది. ఆ తర్వాతనే ఇండియా మరియు విదేశాల్లోని వ్యూయర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన హనీ ట్రెహాన్ దీనికి కూడా దర్శకత్వం వహిస్తుండగా, స్మితా సింగ్ ఈ మూవీకి రైటర్ గా వర్క్ చేస్తున్నారు.
అయితే ఈసారి కథ ది బన్సాల్ మర్డర్స్ అనే ఫిక్షనల్ స్టోరీ చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. మొదటి భాగం మంచి హిట్టైన నేపథ్యంలో ఆడియన్స్ ఈ రెండో భాగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి క్రైమ్ థ్రిల్లర్ తో రానుండటంతో రాత్ అకేలి హై: ది బన్సల్ మర్డర్స్ పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎప్పట్నుంచి స్ట్రీమింగ్ కానుందనే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే వెల్లడించే అవకాశాలున్నాయి.
