సినిమా కథను తలపించేలా అలనాటి హీరోయిన్ లవ్ స్టోరీ
ఆరేళ్ల వయసు నుంచే యాక్టింగ్ లో ఓనమాలు నేర్చుకుని చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించారు సీనియర్ హీరోయిన్ రాశీ.
By: Sravani Lakshmi Srungarapu | 23 Sept 2025 3:00 AM ISTఆరేళ్ల వయసు నుంచే యాక్టింగ్ లో ఓనమాలు నేర్చుకుని చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించారు సీనియర్ హీరోయిన్ రాశీ. హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు చేశారు రాశీ. 90స్ టైమ్ లో రాశీ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. రీసెంట్ గా సీరియల్స్ లో నటిస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్‌స్టోరీని రివీల్ చేసి అందరికీ షాకిచ్చారు.
ఏడ్చే అబ్బాయిలు సెన్సిటివ్
పర్సనల్ లైఫ్ ను ఇప్పటివరకు ప్రైవేట్ గానే ఉంచిన రాశీ తాజాగా తన లవ్‌స్టోరీని బయటపెట్టి అందరికీ తెలిసేలా చేశారు. రాజేంద్రప్రసాద్ తో కలిసి తాను ఓ సినిమా చేస్తున్నప్పుడు శ్రీనివాస్ ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ అని, అక్కడే ఆయన్ని కలిశానని, శ్రీమంతం సీన్ జరుగుతున్నప్పుడు అది చూసి అతను ఏడ్చాడని, ఏడ్చే అబ్బాయిలు చాలా సెన్సిటివ్ అని, ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటారనిపించిందని చెప్పారు రాశీ.
ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటావా అని అడిగా
అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని, సెట్స్ లో అతన్ని బాగా టీజ్ చేసేదాన్నని, అలా ఓ రోజు ఎక్కువగా ఏడ్పించడంతో సారీ చెప్దామని నెంబర్ తీసుకుని ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగానని, శ్రీనివాస్ ఆ విషయాన్ని కూడా జోక్ అనుకుని వెంటనే ఎస్ చెప్పారని, తర్వాత కలిసి మళ్లీ అడిగినప్పుడే నిజమా అని షాకయ్యారని చెప్పారు రాశీ.
శ్రీనివాస్ ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పినప్పుడు అందరూ షాకయ్యారని, కానీ చివరకు తన తల్లి మాత్రం ఒప్పుకున్నట్టు రాశీ చెప్పుకొచ్చారు. పరిచయమైన నెల రోజులకే ఇద్దరం పెళ్లి చేసుకున్నామని, పెళ్లి కూడా తమ ఇంట్లోనే ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిగిందని ఆమె చెప్పారు. ఆ రోజుల్లో షూటింగ్ టైమ్ లో జరిగిన ఫన్నీ మూమెంట్స్ ను కూడా రాశీ బయటపెట్టారు. షూట్ స్టార్టింగ్ లో తన స్టాఫ్ ఇంకా రాకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఇంకా రెడీ అవలేదా అంటూ స్క్రిప్ట్ ఇచ్చారని, తీరా చూస్తే స్క్రిప్ట్ లో ఆ సీన్ లో తన డైలాగ్స్ లేకపోవడం చూసి వెళ్లిపోయారని, తర్వాత కొంచెం క్లోజ్ అయ్యాక ఆ రోజు ఎందుకొచ్చావని అడిగితే మీ లాంటి హీరోయిన్ ను దగ్గర్నుంచి చూడాలనిపించి వచ్చానని చెప్పారన్నారు.
రాశీ తమ లవ్ స్టోరీని, ఆ టైమ్ లో జరిగిన సంఘటనలను బయటపెట్టడంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్వయంగా హీరోయినే, అసిస్టెంట్ డైరెక్టర్ కు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని అడగడం, ప్రపోజ్ చేసుకున్న తర్వాత నెల రోజుల్లోనే పెళ్లి చేసుకోవడం, ఇదంతా ఓ సినిమా కథలా ఉందంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
