స్టైలిష్ అవతార్‌లో రాశి ఖన్నా.. మోనోక్రోమ్ ట్రెండ్ సెట్!
టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో పవర్-డ్రెస్సింగ్ గోల్స్‌ను సెట్ చేస్తూ అలరిస్తున్న బ్యూటీ రాశి ఖన్నా, తాజాగా తన స్టైలిష్ ఫోటోలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
By: Madhu Reddy | 21 Sept 2026 9:50 PM ISTటాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో పవర్-డ్రెస్సింగ్ గోల్స్‌ను సెట్ చేస్తూ అలరిస్తున్న బ్యూటీ రాశి ఖన్నా, తాజాగా తన స్టైలిష్ ఫోటోలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. షార్ప్‌గా ఉన్న క్లాసీ వైట్ బ్లేజర్ మిని డ్రెస్‌లో ఆమె ఇచ్చిన కాన్ఫిడెంట్ అండ్ రాయల్ పోజులు నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. మోడర్న్ టచ్‌తో ఉన్న ఈ మోనోక్రోమ్ అవతార్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్ మనసులను కొల్లగొడుతున్నాయి..ఆ విశేషాలు చూద్దాం..
వైట్ బ్లేజర్ మిని డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్ :
తాజా స్పెషల్ ఫోటోషూట్ కోసం రాశి ఖన్నా ప్రసిద్ధ స్టైలిస్ట్ షీఫా జే గిలానీ డిజైన్ చేసిన వైట్ బ్లేజర్ మిని డ్రెస్‌ను ఎంచుకుంది. ఇక ప్లంగింగ్ నెక్‌లైన్, స్ట్రక్చర్డ్ షోల్డర్స్‌తో ఉన్న ఈ వైట్ అవుట్‌ఫిట్‌లో రాశి ఎంతో ఎలిగంట్‌గా కనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా సాఫ్ట్ రెట్రో వేవ్ బ్యాంగ్స్, వార్మ్ బ్లష్ టోన్స్, నూడ్ లిప్‌స్టిక్ జత చేసి ఆమె ఇచ్చిన రాయల్ లుక్ ఈ ఫోటోషూట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
'డోమ్‌స్క్రోల్' అంటూ ఆసక్తికర క్యాప్షన్:
సోషల్ మీడియాలో ఈ గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ రాశి ఖన్నా "మీరు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉన్న సమయంలో.." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు "స్టన్నింగ్", "బ్యూటిఫుల్ ఐకాన్", "ఫ్యాషన్ క్వీన్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్:
ఇక 'యోధ', 'అరన్మనై 4', 'ది సబర్మతి రిపోర్ట్' వంటి సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మంచి విజయాలు అందుకుంది రాశి. నటిగా తనలోని వైవిధ్యాన్ని చూపుతూనే, మరోవైపు హెవీ ఫ్యాషన్ ఎడిటోరియల్ షూట్స్‌తో సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ టాప్ స్టైల్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
చేతిలో వరుస క్రేజీ ప్రాజెక్టులు:
ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన 'ధర్మన్', సిద్ధార్థ్ సరసన 'రౌడీ అండ్ కో', ఆర్. మాధవన్‌తో 'బ్రిడ్జ్'మూవీస్ తో ఫుల్ బిజీగా వుంది. తన అద్భుతమైన గ్లామర్ అండ్ యాక్టింగ్ స్కిల్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తున్న రాశి ఖన్నా, రాబోయే రోజుల్లో అన్ని భాషల్లోనూ మరిన్ని భారీ విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
