Begin typing your search above and press return to search.

బాలీవుడ్ పై రాశీ ఖ‌న్నా సంచ‌ల‌న కామెంట్స్

టాలీవుడ్ లో సినిమాలు చేసే హీరోయిన్ల‌కు గౌర‌వం ఎక్కువ‌గా ఉంటుంద‌ని హీరోయిన్ రాశీ ఖ‌న్నా రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 Oct 2025 12:00 AM IST
బాలీవుడ్ పై రాశీ ఖ‌న్నా సంచ‌ల‌న కామెంట్స్
X

టాలీవుడ్ లో సినిమాలు చేసే హీరోయిన్ల‌కు గౌర‌వం ఎక్కువ‌గా ఉంటుంద‌ని హీరోయిన్ రాశీ ఖ‌న్నా రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో న‌టీన‌టుల మ‌ధ్య చాలా మంచి ఫ్రెండ్‌షిప్, బెస్ట్ అట్మాస్పియ‌ర్ ఉంటుంద‌ని, మ‌రీ ముఖ్యంగా ఇక్క‌డ హీరోయిన్ల‌కు చాలా రెస్పెక్ట్ ఇస్తార‌ని, టాలీవుడ్ లో వ‌ర్క్ చేస్తుంటే ఎప్పుడూ ఒక ఫ్యామిలీలో ఉన్న‌ట్టే అనిపిస్తుంద‌ని రాశీ ఖ‌న్నా చెప్పారు.

తెలుగు ఆడియ‌న్స్ ఎక్కువ అభిమానం చూపిస్తారు

టాలీవుడ్ లో వ‌ర్కింగ్ అవ‌ర్స్ చాలా క్ర‌మ‌బ‌ద్ధంగా ఉంటాయ‌ని, ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే కాల్షీట్స్ ఉంటాయ‌ని, బాలీవుడ్, త‌మిళ ఇండ‌స్ట్రీలో ఒక్కో కాల్షీట్ 12 గంట‌లు ఉంటుంద‌ని, అందుకే ఎక్కువ‌గా అల‌సిపోతామ‌ని, పైగా తెలుగు ఆడియ‌న్స్ త‌న‌పై ఎక్కువ అభిమానం చూపిస్తూ ఉంటార‌ని, తాను ఇత‌ర భాష‌ల్లో చేసిన సినిమాల‌ను కూడా తెలుగు ఫ్యాన్స్ ఆద‌రిస్తార‌ని ఆమె పేర్కొన్నారు.

సౌత్ ఇండ‌స్ట్రీని చూసి నేర్చుకోవాలి

సౌత్ లో దొరికిన‌ట్టు నార్త్ లో రెస్పెక్ట్ దొర‌క‌ద‌ని, బాలీవుడ్ లోని న‌టీన‌టులు ఆడంబ‌రంగా ప్ర‌వ‌ర్తిస్తార‌ని, సౌత్ ఇండ‌స్ట్రీని చూసి నార్త్ లోని కొంత‌మంది నేర్చుకోవాల‌ని రాశీ చెప్ప‌డంతో ఆ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీశాయి. నార్త్ లో ఎక్కువ సినీ అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఇలా ఇష్ట‌మొచ్చిన‌ట్టు కామెంట్స్ చేయ‌డం స‌రికాద‌ని రాశీని కొంద‌రు త‌ప్పుబ‌డుతున్నారు.

కానీ మ‌రికొంద‌రు మాత్రం త‌న అభిప్రాయం తాను చెప్పింది ఇందులో త‌ప్పేముంద‌ని రాశీని వెనుకేసుకొస్తున్నారు. అయితే రాశీ మాత్రం త‌న అనుభ‌వాన్ని మాత్ర‌మే చెప్పాన‌ని చెప్తున్నారు. చాలా రోజుల త‌ర్వాత రాశీ ఖ‌న్నా తెలుగులో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ తో క‌లిసి తెలుసు క‌దా అనే సినిమా చేయ‌గా, ఆ మూవీ అక్టోబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుసు క‌దా ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న రాశీ ఓ ఇంట‌ర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. ఈ సినిమా హిట్టైతే టాలీవుడ్ నుంచి మ‌రిన్ని అవ‌కాశాలొస్తాయ‌ని రాశీ తెలుసు క‌దాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.