ఉస్తాద్‌ని పొగడ్తల్లో ముంచేసిన అందాల నాయికలు
మొత్తానికి రాశీ ఖన్నా అద్భుతమైన స్పీచ్‌తో హుందాతనాన్ని చాటుకోగా, శ్రీలీల తన మాస్ అండ్ ఎనర్జిటిక్ మాటలతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించారు.
By: Sivaji Kontham | 16 March 2026 9:35 AM ISTహైదరాబాద్‌లో జరిగిన `ఉస్తాద్ భగత్ సింగ్`అట్టహాసమైన ప్రీరిలీజ్ వేడుకలో చిత్ర కథానాయికలు రాశీ ఖన్నా - శ్రీలీల తమ ప్రసంగాలతో అభిమానులను ఉత్సాహపరిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడంపై వారు వ్యక్తం చేసిన భావాలు ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచాయి.
రాశీ ఖన్నా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌తో పని చేయడం ఎంతో గౌరవమని అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి లెజెండరీ సరసన నటించడం తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు రాశీ పేర్కొన్నారు. ఆయన సింప్లిసిటీ ఆయనకున్న క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని, షూటింగ్ సమయంలో ఆయన అందించిన మద్దతును ఎప్పటికీ మర్చిపోలేనని రాశీ ఎంతో భావోద్వేగంతో చెప్పారు.
దర్శకుడు హరీష్ శంకర్ గురించి మాట్లాడుతూ.. రాశీ తనపై నమ్మకం ఉంచి ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్రను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన పాత్రలో ఉన్న ఎమోషనల్ షేడ్స్ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఫ్యాన్స్ గురించి ప్రస్తావిస్తూ ... మీ పవర్ స్టార్ మా ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తుపాను సృష్టిస్తుంది అని పేర్కొంటూ అభిమానులను ఖుషీ చేశారు.
ఇక శ్రీలీలతనదైన చలాకీతనంతో వేదికపై సందడి చేశారు. పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కల నెరవేరినట్లు ఉందని ఉత్సాహంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ పవర్ పప హరీష్ శంకర్ గారి మాస్ మేకింగ్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుందని సెట్స్‌లో పవన్ గారి ఎనర్జీ చూసి తాను ఎంతో నేర్చుకున్నానని ఆమె వెల్లడించారు.
శ్రీలీల మాట్లాడుతూ ఈ సినిమాలో తన డ్యాన్స్ .. పవన్ కళ్యాణ్ గారి మేనరిజమ్స్ మధ్య ఉండే సింక్ థియేటర్లలో ఈలలు వేయిస్తుందని అన్నారు. ప్రతి సీన్ లోనూ ఒక వైబ్రేషన్ ఉంటుంది.. హరీష్ ఈ సినిమాను ఒక సెలబ్రేషన్‌లా తీర్చిదిద్దారుఅని పేర్కొన్నారు. తన డ్రెస్సింగ్ లుక్ పై అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కల్యాణ్ ని చూస్తూ చాలా విషయాలలో స్ఫూర్తి పొందానని శ్రీలీల అన్నారు.
మొత్తానికి రాశీ ఖన్నా అద్భుతమైన స్పీచ్‌తో హుందాతనాన్ని చాటుకోగా, శ్రీలీల తన మాస్ అండ్ ఎనర్జిటిక్ మాటలతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించారు. ఇద్దరు హీరోయిన్లు తమ ప్రసంగంలో పవర్ స్టార్ పై ప్రశంసలు కురిపించడంతో శిల్పకళా వేదిక మార్మోగింది. వీరిద్దరి కెమిస్ట్రీ పవన్ కళ్యాణ్‌తో ఎలా ఉండబోతుందో చూడాలని ఇప్పుడు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
