సినిమాల్లో ఆడవాళ్లను ఆట వస్తువులుగా!
మారుతున్న ప్రపంచంలో మహిళల ప్రవర్తనలో చాలా మార్పులొచ్చాయి. పెరిగిన విద్య, సామాజిక జ్ఞానం, ఆర్థిక స్వేచ్ఛ కారణంగా స్త్రీలు ఇప్పుడు పురుషుల కంటే చాలా ఎక్కువ.
By: Srikanth Kontham | 6 Dec 2025 1:14 PM ISTమారుతున్న ప్రపంచంలో మహిళల ప్రవర్తనలో చాలా మార్పులొచ్చాయి. పెరిగిన విద్య, సామాజిక జ్ఞానం, ఆర్థిక స్వేచ్ఛ కారణంగా స్త్రీలు ఇప్పుడు పురుషుల కంటే చాలా ఎక్కువ. స్త్రీ ఆకాశం ఎత్తు. అసలు మహిళ సాధించనిది లేనే లేదు. అంతరి క్షంలోకి కూడా ప్రయాణించగలదు. అయితే బాగా ఎదిగిన లేదా ప్రగతిశీల మహిళ ను పురుషాహంకారులు చూసే విధానం వేరు. ధైర్యంగా ప్రశ్నిస్తే లేదా ఎదురిస్తే ఆ మహిళను అహంకారి అని, దుర్మార్గురాలు అని ముద్ర వేస్తారు. కళారంగంలోనూ కథానాయికలను మారుతున్న వివిద దశలలో రకరకాల కోణాల్లో ఆవిష్కరించారు.
మహిళా పాత్రాల్లో ఎన్నో మార్పులు:
ప్రతి దశాబ్ధానికొకసారి మహిళా పాత్రల చిత్రణ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సె*గా, టూమచ్ బోల్డ్‌గా కూడా చూపించారు. కొన్నిసార్లు వ్యాంపులుగా, ఐటమ్ గాళ్స్‌గా కూడా చూపించారు. 90లలో స్త్రీ పాత్రలకు గ్లామర్ ఎక్కువగా అద్దారు. వ్యాంప్ పాత్రలు కూడా అప్పట్లో ఎక్కువ. కానీ కాలక్రమంలో చాలా మారింది. పొగ తాగే లేదా మద్యానికి బానిసైన స్త్రీని కూడా 2000 -2010 మధ్యలో చూపించారు. పార్టీలో నైట్ క్లబ్ లలో కనిపించే స్త్రీ పాత్రలను నాటి దర్శక రచయితలు రాసుకు నేవారు. అయితే ఇటీవలి కాలంలో నాయికా ప్రధాన చిత్రాలు పెరిగాయి.
రాశీఖన్నా ఇవి గుర్తించలేదా:
కథానాయికల రేంజ్ పెరిగింది. అనుష్కశెట్టి, నయనతార, కీర్తి సురేష్, సమంత, రష్మికా మందన్నా దక్షిణాదిలో ఏ స్థాయికిచేరారన్నది చెప్పాల్సిన పనిలేదు. దీపిక పదుకొణే, ఆలియా భట్, కత్రినా కైఫ్ వంటి నటీమణులు స్పై ఏజెంట్లుగా, పోలీస్ అధికారులగా నటించి మేల్ పాత్రలతో పోటీపడుతున్నారు. ఇదంతా కళారంగంలో మహిళా నటీమణుల సాధించిన పురోగతిగానే చెప్పాలి. ఇంకా ముందుకెళ్తే మేల్ పాత్రలకు ధీటుగా ఛాన్స్ వచ్చినప్పుడల్లా సత్తా చాటుతున్నారు. మరి ఇవన్నీ నటి రాశీఖన్నా గమనించిందో? లేదో తెలియదు గానీ..
ఇదేం వివక్ష అంటోన్న నటి:
తాజాగా సినిమాల్లో ఆడవాళ్లను ఆట వస్తువుల్లా చూపిస్తున్నారని ఆరోపించింది. ఈ వివక్ష చాలా కాలంగా కొనసాగుతుందని అభిప్రాయపడింది. అన్ని చిత్ర పరిశ్ర మల్లోనూ నటీమణుల పరిస్థితి ఇలాగే ఉందంది. మహిళా పాత్రలు ఇంకా తాను అనుకున్న స్థాయిలో రావడం లేదంది. భవిష్యత్తులోనైనా మార్పులొ స్తాయేమోనని ఎదురు చూస్తానంది. చాలా మంది నటీమణులు దీన్నో సమస్యగా భావిస్తున్నట్లు పేర్కొంది. గతంలో రీచా చద్దా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ప్రస్తుతం రాశీఖ న్నా హిందీలో `బ్రిడ్జ్`, `తాల్కోన్ మెయిన్ ఏక్` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే కొన్నికొత్త కథలు కూడా విందని..వాటికి త్వరలోనే సైన్ చేస్తుందని సమాచారం.
