Begin typing your search above and press return to search.

చీరకట్టులో గ్లామర్ డోస్ పెంచేసిన రాశి ఖన్నా!

ఈ క్రమంలోనే తాజాగా.. ఆలివ్ గ్రీన్ కలర్ చీర ధరించిన ఈమె హెవీ ఎంబ్రాయిడరీ తో బోర్డర్ డిజైన్ చేశారు. దీనికి కాంబినేషన్లో గోల్డ్ కలర్ డీప్ ఫ్రంట్ వీ నెక్ తో డిజైన్ చేసిన బ్లౌజ్ ని ధరించింది.

By:  Madhu Reddy   |   22 Sept 2025 10:11 PM IST
చీరకట్టులో గ్లామర్ డోస్ పెంచేసిన రాశి ఖన్నా!
X

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఒకవైపు గ్లామర్ తో ఆకట్టుకుంటూనే.. మరొకవైపు చీరకట్టులో కూడా అలరిస్తున్నారు. కొంతమంది అదే చీరకట్టులో గ్లామర్ డోస్ పెంచేసి మరీ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఒకరు. ఎప్పుడూ మోడ్రన్ దుస్తులలో కనిపించే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు చీరకట్టులో కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేసింది. మునుపెన్నడూ చూడని విధంగా చాలా అందంగా ఉంది అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా.. ఆలివ్ గ్రీన్ కలర్ చీర ధరించిన ఈమె హెవీ ఎంబ్రాయిడరీ తో బోర్డర్ డిజైన్ చేశారు. దీనికి కాంబినేషన్లో గోల్డ్ కలర్ డీప్ ఫ్రంట్ వీ నెక్ తో డిజైన్ చేసిన బ్లౌజ్ ని ధరించింది. ఇందులో పైట కొంగును పక్కకు జరిపి మరీ ఎద అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీనికి తోడు నేను ప్రతిసారి ప్రేమలో పడుతుంటాను తెలుసు కదా అంటూ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ క్యాప్షన్ జోడించింది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'తెలుసు కదా' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇలా చీరకట్టులో కనిపించి తన గ్లామర్ తో ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది. మొత్తానికైతే నడుము ఒంపులతో, ఎద అందాలతో గ్లామర్డోస్ పెంచేసి హీట్ పుట్టిస్తోంది అని చెప్పవచ్చు.

రాశిఖన్నా నటిస్తున్న తెలుసు కదా సినిమా విషయానికి వస్తే.. తెలుగు భాష రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఈ సినిమా రాబోతోంది. నీరజా కోన రచన, దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ ఉండగా.. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాల్లో హర్ష చెముడు, రవి మరియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా.. వి ఎస్ జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీపావళి సందర్భంగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

రాశిఖన్నా విషయానికి వస్తే.. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత మనం సినిమాలో అతిధి పాత్ర పోషించింది. తర్వాత పలు తెలుగు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తెలుగు, తమిళ్ భాషల్లో కూడా నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా భాగమైంది రాశి కన్నా. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది.